Begin typing your search above and press return to search.
పవన్ 'పిడికిలి' కి 'పవర్' వస్తుందా?
By: Tupaki Desk | 8 Oct 2018 11:34 AM GMTఒక రాజకీయ పార్టీ పేరు చెప్పగానే జనానికి ఠక్కున ఆ పార్టీ గుర్తు మదిలో మెదలడం సహజం. ఆ పార్టీ గుర్తు ఎంత బలంగా జనం మనసుల్లో ముద్రితమైతే ...ఆ పార్టీకి అంత మంచిది. నిరక్షరాస్యులైన ఓటర్లు....ఎక్కువగా తమకు నచ్చిన పార్టీ గుర్తును బట్టి ఓటును గుద్దేస్తుంటారు. ఇక వాడుక భాషలో కూడా హస్తం. కమలం.. గులాబీ. - సైకిలు...ఇలాంటి పార్టీ సింబల్స్ ఎక్కువగా జనం నోట్లో నానుతుంటాయి. వైసీపీ గుర్తు ` ఫ్యాన్` ను జనంలోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ అధినేత జగన్ చాలా కష్టపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పార్టీ అనుకూల ఓటింగ్ ను కూడా తలకిందులు చేయగల శక్తి పార్టీ గుర్తుకు ఉంటుంది. అందుకే అంతటి ప్రాధాన్యత ఉన్న పార్టీ గుర్తును రాజకీయ పార్టీలు ఆచితూచి ఎంచుకుంటాయి. జనంలో చొచ్చుకుపోగల గుర్తు కోసం మేధోమధనం చేస్తుంటాయి. అదే క్రమంలో తాజాగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతోన్న జనసేనాని పవన్...తన పార్టీ గుర్తును `పిడికిలి`గా ప్రకటించారు. అయితే, ఆ గుర్తుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించకపోవడంపై ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోందట.
ప్రస్తుతం జనసేన కార్యకర్తలను ప్రజారాజ్యం చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. మొదట్లో ఆ పార్టీకి కేటాయించిన రైలింజన్ గుర్తు పీఆర్పీకి పీడకలను మిగిల్చింది. రైలింజన్ ను పోలి ఉన్న బస్సు, రోడ్డు రోలర్ గుర్తులను ఎంచుకున్న స్వతంత్ర అభ్యర్థులకు పీఆర్పీ ఓట్లు పడడంతో ఆ పార్టీ ఖంగుతినాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆ పార్టీ అస్తమించే సమయానికి `సూర్యుడు` గుర్తు వచ్చినా...పార్టీ మాత్రం ప్రకాశించలేక `హస్త`గతమైంది. ప్రస్తుతం జనసేనకు కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఉంది. జనసేన జెండాలో ఉన్న `స్టార్` గుర్తు జనంలోకి వెళ్లిపోయింది. కానీ, పవన్ మాత్రం `పిడికిలి`గుర్తు కోసం ఈసీ దగ్గర పిడికిలి బిగించారు. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ గుర్తుల గోల మొదలైంది. కానీ, జనసేనకు పిడికిలి గుర్తు ఖరారు కాలేదు. ఒకవేళ, ఈసీ `పిడికిలి` బిగించకపోతే...కొత్త గుర్తుతో జనంలోకి వెళ్లడం జనసేనానికి తలకు మించిన భారమే. పోనీ, జనసేనకు ఆ గుర్తు వచ్చినా...అతి తక్కువ సమయంలో జనాల్లోకి తీసుకు వెళ్లడం కూడా అంత సులువు కాదు. ఏది ఏమైనా...పవన్ ఎత్తిన పిడికిలి దించాల్సి వస్తే మాత్రం....పీఆర్పీలా ఇబ్బంది తప్పదనే వాదన వినిపిస్తోంది. మరి, ఇన్నాళ్లూ తన పార్టీ `గుర్తు`వ్యవహారం పవన్ కు ఎందుకు `గుర్తు`కు రాలేదో ఆయనకే ఎరుక!