Begin typing your search above and press return to search.
PSPK 29-PSPK 30 ఎప్పుడు? ఎవరెవరితో?
By: Tupaki Desk | 8 March 2020 6:49 AM GMTరాజకీయాలతో పాటు సినిమాలు చేస్తూ.. ఆ రెండిటినీ జోడుగుర్రాల్లా పరిగెట్టిస్తాను! అంటూ.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు పవన్ కల్యాణ్. పవర్ స్టార్ ఒక మాట చెప్పారంటే ఎంత డెడికేషన్ తో ఉంటారో తాజా సన్నివేశం ప్రాక్టికల్ గానే చెబుతోంది. పవన్ వరుస కమిట్ మెంట్లు చూసి ఆయనలో ఇంత తెగువ ఉందా ? అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వాస్తవానికి ఒక్కో చిత్రం చేయడానికి గతంలో పవన్ కల్యాణ్ కు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పట్టేది. అభిమానులు ఎంతో ఓపిగ్గా పవర్ స్టార్ చిత్రం
ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ లోనే ఉంది. ఆయన గేర్ మార్చారు. ఈ ఒక్క ఏడాదిలోనే నాలుగైదు చిత్రాలు చేసేస్తున్నారు. ఒకేసారి నాలుగింటికి ఓకే చెప్పి ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. దీనిని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఇది ఈ ఏడాది మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేసి అభిమానులకు పండగ చేయాలని పవన్ భావిస్తున్నారట. ఈ రెండు చిత్రాలు సెట్స్ లో ఉండగానే పవర్ స్టార్ మూడో చిత్రానికి అప్పుడే కమిట్ అయ్యారని సమాచారం. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌నాటికి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీనికి గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ మూవీ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు.
ఇదిలా ఉండగానే.. పవర్ స్టార్ నటించే 29వ సినిమా.. 30వ సినిమా గురించి ఆసక్తికర సంగతులు బయటికి వచ్చాయి. ఆయన ఇప్పటికే ఆ రెండిటికీ కూడా కమిటైపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 29వ సినిమా త్రివిక్రమ్ తో 30వ సినిమా పూరి జగన్నాథ్ తో చేయనున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రెండు సినిమాలు 2021 - 22 సీజన్ లో విడుదలవుతాయని తెలిసింది. పవర్ స్టార్ దూకుడు చూస్తుంటే ఫ్యాన్స్ కే కాదు.. అటు సినీవర్గాలకు నోట మాట రావడం లేదు. పవర్ స్టార్ నా మజాకానా అంటూ అతడిని పొగిడేయకుండా ఉండలేకపోతున్నారు. ఇస్పీడ్ లోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వారసుడు అకీరాను బరిలో దించే వీలుందని కూడా భావిస్తున్నారు. అందుకే రేణు దేశాయ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ లో మకాం వేశారన్న చర్చా వేడెక్కిస్తోంది.