Begin typing your search above and press return to search.
క్రిష్ కు పవన్ కళ్యాణ్ నో చెప్పారా?
By: Tupaki Desk | 31 Oct 2019 11:55 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా నవంబర్ మూడోవారంలో లాంచ్ అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా పవన్ రీఎంట్రీ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయంలో స్పెక్యులేషన్లు జోరుగా సాగుతున్నాయి.
పవన్ సినిమాకు క్రిష్ దర్శకుడని అంటున్నారు కానీ ఇంకా అదేమీ కన్ఫమ్ కాలేదని పవన్ ఇంకా తన సినిమాకు దర్శకుడి విషయంలో నిర్ణయం తీసుకోలేదని సమాచారం. క్రిష్ పేరు పరిశీలనలో ఉన్నది మాత్రం నిజమేనట.. క్రిష్ కు గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదట. క్రిష్ కు పవన్ ఆల్రెడీ నో చెప్పారని కూడా మరో వెర్షన్ వినిపిస్తోంది. అయితే ఏ విషయం తేలాలంటే మాత్రం మరో నాలుగైదు రోజులు వేచి చూడక తప్పదు.
పవన్ సినిమాకు దర్శకుడిగా క్రిష్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు యువ దర్శకుల పేర్లు వినిపించాయి కానీ వారి విషయంలో పవన్ ఆలోచన ఏంటనేది ఇంకా తెలియదు. త్రివిక్రమ్ త్వరలో ఫ్రీ అవుతారు కాబట్టి పవన్ సినిమా బాధ్యతలు చేపట్టే విషయం కూడా తోసిపుచ్చలేమని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!