Begin typing your search above and press return to search.
ఆస్కార్ అనటం తొందరపాటేమో
By: Tupaki Desk | 14 April 2018 5:38 AM GMTనిన్న గ్రాండ్ గా జరిగిన రంగస్థలం సక్సెస్ మీట్ మెగా ఫాన్స్ అంచనాలు పూర్తిగా నిలబెట్టేసింది. ఎన్నడు లేనిది తనది కాని సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ 24 నిమిషాల సేపు ప్రసంగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రసాద్ ఐమాక్స్ లో రంగస్థలం చూసాక అన్ని సక్సెస్ మీట్ లో మాట్లాడతాను అంటే ఏంటో అనుకున్న మీడియా సైతం షాక్ అయ్యేలా పవన్ సినిమా గురించి చరణ్ గురించి పదే పదే పొగుడుతూ చెప్పడం కూడా నిన్నటి ఈవెంట్ లో హై లైట్. అందులో చాలా విషయాలు ఉన్నాయి కాని ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన మాట ఆస్కార్. రంగస్థలం సినిమా ఆస్కార్ కు పూర్తి అర్హత కలిగిందని రాజకీయాలు సినిమాలకతీతంగా అందరు ఒకేతాటిపైకి వచ్చి దీన్ని ఆస్కార్ కు నామినేట్ చేయాలనీ పవన్ పిలుపు ఇవ్వడం చర్చకు దారి తీసేదే. పవన్ చెప్పినట్టు కేవలం ఐఎండిబి సైట్ ఇచ్చే రేటింగ్స్ బట్టో లేక ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ని బట్టో ఆస్కార్ కు అర్హతను నిర్ధారించలేం. దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి. వాటిని మీట్ అయితేనే నామినేషన్ గురించి ఆలోచించవచ్చు. గెలవడం సంగతి తర్వాత.
రంగస్థలం భారీ వసూళ్లు సాధించిన కమర్షియల్ సినిమా. అందులో సందేహం అక్కర్లేదు. వేసవి సీజన్ కావడం-విడుదల సమయానికి నెల రోజుల ముందు వరకు వివిధ కారణాల వల్ల ఒక్కటంటే ఒక్కటి మాస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద లేకపోవడం – ఇలాంటి గ్రామీణ నేపధ్యంలో తెలుగు సినిమా రాక ఏళ్ళు గడవడం ఇవన్ని కలిసివచ్చి రంగస్థలంకి అనూహ్యమైన కలెక్షన్స్ ఇచ్చాయి. 80ల నాటి నేపధ్యాన్ని పక్కన పెడితే గ్రామంలో ప్రెసిడెంట్ గా నామినేషన్ వేసినందుకు అన్నను చంపిన వారిపై తమ్ముడు ప్రతీకారం తీర్చుకునే కథే ఇది. అంతే. కాని సుకుమార్ టేకింగ్-ఆర్ట్ డైరెక్షన్-దేవి మ్యూజిక్-రత్నవేలు పనితనం ఇవన్ని మరో లెవెల్ కు తీసుకెళ్ళాయి. అందుకే కొత్త అనుభూతి చెందిన ప్రేక్షకులు లోపాలను క్షమించి బ్లాక్ బస్టర్ చేసేసారు. అంతే తప్ప జిగేల్ జిగేల్ రాణి అంటూ ఐటెం సాంగ్స్ ని కమర్షియల్ ఫార్ములా కోసం వాడుకున్న సినిమాను ఆస్కార్ కు పంపాలి అనుకోవడం తొందరపాటే.
టాలీవుడ్ లో చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీసిన కె.విశ్వనాధ్-దాసరి నారాయణరావు-కోడి రామకృష్ణ-రాఘవేంద్ర రావు-బాల చందర్-బాలు మహేంద్ర-మణిరత్నం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉంటుంది కాని ప్రమాణాల పరంగా చాలా ఉన్నతంగా సినిమాలు తీసినా వీళ్ళలో ఎవరికి ఆస్కార్ సినిమా పడలేదు. దానికి తోడు మన ఇండియన్ నేటివిటీ ఆస్కార్ స్టాండర్డ్ కు మ్యాచ్ కాదు. అందుకే కమల్ లాంటి హీరోలు ఆస్కార్ ను గొప్పగా చూడాల్సిన అవసరం లేదని ఏనాడో తేల్చి చెప్పారు. సో రంగస్థలం వసూళ్ళ ప్రాతిపాదికన ఆస్కార్ కు నామినేట్ చేయటం అనేది మాట్లాడుకోవడానికి బాగుంది కాని ప్రాక్టికల్ గా జరగడం ఈజీ కాదు