Begin typing your search above and press return to search.
తొలిప్రేమ తరువాత.. రంగస్థలమే -పవన్ కళ్యాణ్
By: Tupaki Desk | 10 April 2018 4:11 AM GMTరంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హీరో రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా ఇటు కలెక్షన్లతో పాటు అటు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం వస్తున్నాయి. హీరో రామ్ చరణ్ కు ఈ సినిమా వల్ల అతి అరుదైన ప్రశంస లభించింది. అది మరెవరి నుంచే కాదు.. తన బాబాయ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి.
పవన్ తాజాగా రంగస్థలం మూవీ థియేటర్ కు వెళ్లి మరీ చూసొచ్చాడు. చూడటమే కాదు.. అబ్బాయి రామ్ చరణ్ ను బాగానే మెచ్చుకున్నాడు. ‘‘తొలిప్రేమ తరవాత ఎందుకో రంగస్థలం సినిమా థియేటర్ లో చూడాలని అనిపించింది. రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉంది. ప్రొడ్యూసర్స్ చాలామంచి సినిమా నిర్మించారు. డైరెక్టర్ సుకుమార్ రాసిన కథ గొప్పగా ఉంది. వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్న అద్భుతమైన కథ. నా మనసుకు విపరీతంగా నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా గురించిన మిగతా విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడదామని నిర్ణయించుకున్నా’’ అంటూ మూవీ గురించి పవన్ చెప్పుకొచ్చాడు.
పవన్ సాధారణంగా బయట సినిమాల గురించి చాలా తక్కువ మాట్లాడతాడు. మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలున్నా వాళ్ల గురించి కామెంట్ చేసేదీ తక్కువే. అజ్ఞాతవాసి తరవాత సినిమాలకు వీడ్కోలు చెప్పేసి ఫుల్ టైం పాలిటిక్స్ కే సమయం కేటాయించడం మొదలెట్టాడు. ఇలాంటి టైంలో సినిమా కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి దాని గురించి చాలా గొప్పగా చెప్పడం రామ్ చరణ్ కు కచ్చితంగా ఉత్సాహాన్నిచ్చేదే.