Begin typing your search above and press return to search.
మెగా టాక్: అన్నీ పవన్ చూసుకుంటున్నాడు
By: Tupaki Desk | 8 July 2015 6:23 AM GMTఇటీవలి కాలంలో అన్నయ్య మెగాస్టార్‌తో పెట్టుకోకుండా స్వయంగా తన పనేదో తాను చేసుకుపోతున్నాడు తమ్ముడు పవన్ కళ్యాణ్. అది వ్యక్తిగతమా, ప్రొఫెషనలా, రాజకీయమా, ఇంకోటా అనేది తనకి అనవసరం. చేసేయాలి అనుకుంటే చేసేయడమే. దీనికి ఇరుగు పొరుగు, గిట్టనివారంతా రకరకాలుగా ప్రచారం చేసేశారు. అన్నయ్యతో తమ్ముడికి పడడం లేదు. తమ్ముడితో అన్నయ్య విడిపోయాడు లాంటి మసాలా వార్తల్ని ప్రచారం చేశారు.
ఇదంతా ఓ ఎత్తుగడతో రాజకీయ ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారం. అసలు మెగా ఫ్యామిలీకి అన్నయ్య లేకపోతే ఇంకేమీ లేనట్టే. అలాంటి అన్నయ్యను పోగొట్టుకోవడానికి పవన్ సిద్ధంగా ఉంటారా? అన్న కామన్‌సెన్స్ లేదా అని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఇక ప్రస్తుత టాపిక్ ఏంటంటే... అన్నయ్య 150వ సినిమా విషయంలో పవన్ ఎందుకు వేలెడుతున్నాడు? అన్నయ్యకు సూచనలు ఎందుకు చేస్తున్నాడు. పూరీతో జాగ్రత్తగా వ్యవహరించమని ఎందుకు చెప్పాడు? దీని గురించి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే... పవన్‌కు తన అన్నయ్యతో స్నేహం ఉందా? రాజకీయ వైరం ఉందా? ఇదంతా ట్రాష్. ప్రస్తుతం పవన్ అన్నయ్య చెవిలో ఓ సంగతిని ఊదాడు. పూరీతో పక్కాగా కథ ఉంటేనే ముందుకు వెళ్లు. లేదంటే లైట్ తీస్కో. కథ, కాకరకాయ లేకుండా 150వ సినిమా చేయొద్దు అని సూచించాడు. అందుకే చిరు సైతం ఆ సంగతిని దృష్టిలో పెట్టుకుని తెలివిగా అడుగులు వేస్తున్నాడు.. అని చెబుతున్నారు సన్నిహితులు.
అందుకే మెగా క్యాంప్ కథను పక్కాగా తయారు చేసుకుని రమ్మని పూరీకి సూచించిందిట. ఆటోజానీ సెట్స్‌కెళుతుందా? లేదా? అలా సెట్స్‌కెళ్లేప్పుడు అందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమైయుంటుంది? ఇలాంటివన్నీ త్వరలోనే తెలుస్తాయ్. అది సంగతి.