Begin typing your search above and press return to search.
ఈ టైంలో పవన్ నుంచి ఇలాంటి పాటా?
By: Tupaki Desk | 14 March 2017 12:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చాలా వరకు బాధ్యతాయుతమైన పాత్రలే వేశాడు. కొన్ని అల్లరి పాత్రలు వేసినా సరే హద్దులు దాటింది లేదు. సమాజానికి చెడు సందేశాలిచ్చే అంశాలకు తావు లేకుండా చూసుకుంటుంటాడు పవన్. ‘జానీ’ సినిమాలో నువ్వు సారా తాగుట మాను లింగం అంటూ మద్యపానానికి వ్యతిరేకంగా పవన్ ఓ పాట రాయించి.. స్వయంగా తనే పాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన ‘గబ్బర్ సింగ్’లో మందు బాబులం మేము మందు బాబులం అంటూ మందు కొట్టేవాళ్ల వాయిస్ వినిపిస్తూ ఒక పాట ఉంటుంది. ఆ పాట ఆడియోలో విన్నపుడు ఇలాంటి పాట పెట్టారేంటి అనిపిస్తుంది కానీ.. సినిమాలో దానికి కౌంటర్ సీన్లు కూడా ఉండటంతో బ్యాలెన్స్ అయిపోయింది.
ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కోసం రాయించిన తోబా తోబా పాట చెడు అలవాట్లకు వంత పాడుతున్నట్లుగా ఉంటుంది. కానీ ఆ పాటకు సినిమాలో ఇచ్చిన ముగింపు ఓకే అనిపిస్తుంది. తన సినిమాల్లో ‘మందు’ పాటలు పెట్టే సంప్రదాయాన్ని పవన్ ‘కాటమరాయుడు’తోనూ కొనసాగించాడు. ఇందులో ‘జివ్వు జివ్వు’ అంటూ మందు కోసం నాలుక ఎలా లాగేస్తుందో వివరిస్తూ.. మందుబాబుల ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టేలా పాట రాయించారు. సినిమాలో దీన్ని ఎలా తెరకెక్కించారో.. పాటను ఎలా ముగించారో కానీ.. లిరిక్స్ వింటుంటే మాత్రం ఏదో తేడా కొడుతోంది. ప్రస్తుతం పొలిటికల్ లీడర్ గా ఉన్న పవన్.. మున్ముందు రాజకీయాల్లో మరింత క్రియాశీలంగా ఉండాలనుకుంటున్నాడు. ఇలాంటి టైంలో ఈ ‘జివ్వు జివ్వు’లేంటో అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి సినిమాలో ఈ పాటకు సంబంధించి ఏదైనా మతలబు ఉందేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/