Begin typing your search above and press return to search.
పవన్.. ఎన్నాళ్లు ఇలాగే
By: Tupaki Desk | 24 March 2017 1:56 PM GMTతెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. మామూలుగా ఇండస్ట్రీ హిట్లు రావాలంటే కంటెంట్ అసాధారణంగా.. అద్భుతంగా ఉండాలి. కానీ ‘గబ్బర్ సింగ్‘.. ‘అత్తారింటికి దారేది‘ లాంటి ఓ మోస్తరు కంటెంట్ ఉన్న సినిమాల్ని కూడా ఆల్ టైం హిట్లు అందుకున్న ఘనత పవన్ కళ్యాణ్ ది. కానీ అతడి నుంచి అభిమానులు అద్భుతాలేమీ ఆశించరు. అలాగని అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని కంటెంట్ విషయంలో మరీ లైట్ తీసుకుంటేనే కష్టం. ఈ మధ్య పవన్ ఇదే చేస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కెరీర్ ఆరంభం నుంచి కొత్త తరహా కథలకు పెద్ద పీట వేస్తూ.. ఎన్నో ప్రయోగాలు చేస్తున్న పవన్ ఈ మధ్య కథల ఎంపిక విషయంలో పట్టు కోల్పోతున్నాడని.. మరీ సాదాసీదా సినిమాలు చేస్తున్నాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా అభిమానుల కోసం అనే మాట పవన్ సినిమాల విషయంలో ఎక్కువవుతోంది. గత ఏడాది ‘సర్దార్ గబ్బర్ సింగ్‘.. ఇప్పుడు ‘కాటమరాయుడు‘ ఆ కోవలోని సినిమాలే. ఇందులో కథాకథనాల కంటే కూడా అభిమానుల్ని అలరించే అంశాల మీదే ఫోకస్ ఎక్కువైంది. దీంతో సగటు ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు.
‘సర్దార్ గబ్బర్ సింగ్‘ తో పోలిస్తే ‘కాటమరాయుడు‘ కొంచెం బెటరే కానీ.. ఇది కూడా అంత విషయం ఉన్న సినిమా అయితే కాదు. పవన్ వరకు అభిమానుల్ని అలరించేశాడు కానీ.. మిగతా ప్రేక్షకులైతే సినిమాపై పెదవి విరుస్తున్నారు. ఇకపై అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని పవన్ సేఫ్ గేమ్ ఆడటం పక్కనబెట్టి కథాకథనాలపై కొంచెం దృష్టిపెట్టి క్వాలిటీ ఉన్న సినిమాలు చేస్తే బెటరన్నది సగటు సినీ ప్రియుల ఉవాచ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/