Begin typing your search above and press return to search.
పవన్ తగ్గాడని అనుకోవచ్చా..
By: Tupaki Desk | 26 May 2016 5:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత అభిమానించే దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. పవన్ కళ్యాణ్ దాదాపు దశాబ్దం పాటు తన రేంజికి తగ్గ హిట్టు లేక.. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న టైంలో హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో గట్టెక్కించాడు. ‘గబ్బర్ సింగ్’ రీమేకే అయినా.. దాన్ని రీమేక్ లాగా ఎవ్వరూ భావించరు. మూల కథాంశాన్ని మాత్రమే తీసుకుని.. దాన్ని పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా మలిచి బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో హరీష్ పాత్ర కీలకం. పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి.. వారిని ఉర్రూతలూగించాడు హరీష్. ఐతే హరీష్ తో పవన్ కు ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. ఆ సినిమా తర్వాత అతణ్ని ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టినట్లుగా కనిపించింది.
‘గబ్బర్ సింగ్’కు కొనసాగింపుగా సినిమా తీయాలనుకున్నపుడు ఆటోమేటిగ్గా హరీష్ శంకరే ఛాయిస్ కావాలి. కానీ పవన్ మాత్రం అతడికి అవకాశం ఇవ్వలేదు. చివరికి సంపత్ నందిని తప్పించాల్సి వచ్చినపుడు కూడా హరీష్ శంకర్ వైపు చూడలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టైంలో ఎన్నడూ హరీష్ శంకర్ పేరెత్తలేదు. ఆడియో వేడుకకు కూడా అతణ్ని పిలవలేదు. అతడి ప్రస్తావన తేలేదు. దీంతో హరీష్ తో పవన్ ఎక్కడో తేడా కొట్టిందని చాలామంది అనుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ సక్సెస్ క్రెడిట్ తనదే అన్నట్లుగా హరీష్ ప్రొజెక్ట్ చేసుకోవడం పవన్ కు నచ్చలేదు అన్న గుసగుసలు కూడా వినిపించాయి.
ఐతే మళ్లీ హరీష్ తో పని చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా ప్రవర్తించిన పవన్.. ఇప్పుడు ఉన్నట్లుండి ఎ.ఎం.రత్నం నిర్మాణంలో చేయాల్సిన సినిమాకు హరీష్ ను దర్శకుడిగా ప్రిఫర్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి పవన్ అభిమానులు అత్యంత ఆశగా ఎదురు చూసే కాంబినేషన్లలో ఇదొకటి. ‘సర్దార్’ తర్వాత ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ నటించడం వాళ్లకు అంత ఇష్టంలేదు. త్రివిక్రమ్ తో చేస్తే బాగుందనుకున్నారు. కానీ ఆ కాంబినేషన్ లేటయ్యేట్లుంది. కనీసం హరీష్ అయినా లైన్లోకి రావడంతో వాళ్లు చాలాం సంతోషంగా ఉన్నారు. మొత్తానికి పవన్ హరీష్ విషయంలో కాస్త పట్టు వీడి అతడికి అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది.