Begin typing your search above and press return to search.

పవన్ కి నిద్ర లేని రాత్రులెన్నో!

By:  Tupaki Desk   |   31 March 2016 7:30 PM GMT
పవన్ కి నిద్ర లేని రాత్రులెన్నో!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తి చేసేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసింది. మరో రెండు పాటలను జత చేసి, ఇంకోసారి సెన్సార్ చేసి ఫైనల్ సర్టిఫికేట్ తెచ్చుకోనున్నారు. దీంతో ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.

నిజానికి అసలీ మూవీ ఈ డేట్ కి సిద్ధం కావడాన్ని పెద్ద రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే గతేడాది మే నెలలో ప్రారంభమైన షూటింగ్... డిసెంబర్ నాటికి 30 శాతం కూడా కంప్లీట్ కాలేదు. చివరి 50 రోజుల్లో 70శాతం షూటింగ్ చేశామని.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆడియోఫంక్షన్ లో చెప్పేశాడు. అసలు సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 19 నుంచి కంటిన్యూస్ గా షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ సడెన్ గా పవన్ కి జ్వరం రావడంతో.. మూడు రోజుల గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలైంది. అక్కడి నుంచి ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా పిక్చరైజేషన్ పూర్తి చేసేశారు. పలు కెమేరా యూనిట్స్ పెట్టి బాబీ, పవన్ కళ్యాన్, ఆర్థర్ విల్సన్.. ఇలా ఎవరికి వారు తమ పనులను చకచకా కంప్లీట్ చేశారు.

ఇటు షూటింగ్ పూర్తి కాగానే అటు ఎడిటింగ్ కు వెళ్లిపోయే వాడట పవన్. సాయంత్రం 7 నుంచి ఉదయం 5వరకూ గౌతమ్ రాజుతో కలిసి ఎడిటింగ్ పనులు చక్కబెట్టాడు. ఇలా ఎన్నో నిద్ర లేని రాత్రు గడిపి.. అనుకున్న డేట్ ఏప్రిల్ 8కి సర్దార్ గబ్బర్ సింగ్ ని తెరపైకి తెచ్చేస్తున్నాడు పవన్. మరి.. పవర్ స్టార్ పడ్డ ఈ కష్టానికి ఫలితం ఏ రేంజ్ లో ఉంటుందో... అభిమానులు మరో వారంలో చూపించబోతున్నారు.