Begin typing your search above and press return to search.

పవన్ సర్దార్ కి 4 యూనిట్లు ఏం చేశాయో?

By:  Tupaki Desk   |   9 April 2016 9:30 AM GMT
పవన్ సర్దార్ కి 4 యూనిట్లు ఏం చేశాయో?
X
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి చివరి 50 రోజుల్లోనే 70శాతం షూటింగ్ కంప్లీట్ చేశామని.. ఇందుకోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారని.. ఆడియో ఫంక్షన్ సాక్షిగా చెప్పాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మూవీ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. మొదటి రోజు కలెక్షన్స్ రికార్డుస్థాయిలోనే ఉన్నాయి. సినిమాపై మిక్సెడ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

ఏప్రిల్ 8న సినిమాని రిలీజ్ చేసేందుకుగాను నాలుగు యూనిట్లతో పవన్ షూటింగ్ చేయించాడని అన్నారు. ఎలాగూ పవన్ ఉండే సీన్లకు తనే చూసుకుంటాడు. ఇంకో యూనిట్ కి బాబీ - మరో యూనిట్ కి శరత్ మరార్ - మరోదానికి ఆర్థర్ విల్సన్.. ఇలా ఒక్కొకరు ఒక్కో యూనిట్ కి బాధ్యతలు తీసుకుని ఫినిష్ చేశారన్నది టాక్. సర్దార్ సినిమా చూస్తే మాత్రం.. అక్కడక్కడా మినహాయిస్తే ప్రతీ ఫ్రేమ్ లోనూ పవన్ కనిపిస్తాడు. ఈ మూవీ కోసం వేసిన రత్నాపూర్ సెట్లోనే మూడొంతులు సినిమా నడుస్తుంది.

రత్నాపూర్ సెట్ లో కాకుండా.. వేరే సీన్స్ కోసం తీసినవన్నీ గుజరాత్ లో. అక్కడ షూటింగ్ ఎప్పుడో5-6 నెలల క్రితమే అయిపోయింది. రత్నాపూర్ లో అయితే పవన్ లేని సీన్ దాదాపుగా ఉండదు. మరి పవన్ ఏం తీశాడో, మిగిలిన యూనిట్స్ ఏం చేశాయో అంటే.. చెప్పడం మాత్రం కష్టం. చూస్తుంటే ఈ మూవీ ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ వన్ మ్యాన్ షోలాగే కనిపిస్తోంది.