Begin typing your search above and press return to search.
పవన్ పెద్ద సాహసమే చేస్తున్నాడు
By: Tupaki Desk | 28 April 2016 5:30 PM GMTతెలుగు సినిమా హీరోలు ఫ్యాక్షనిస్టు పాత్రల్ని పక్కనబెట్టేసి దశాబ్దం దాటిపోయింది. అప్పట్లో సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు.. ఇంద్ర.. లాంటి సినిమాల్లో హీరోలు ఫ్యాక్షనిస్టులుగా కనిపించారు. ఐతే కొన్నేళ్ల తర్వాత ఈ తరహా సినిమాలకు కాలం చెల్లిపోవడంతో వాటిని పక్కనబెట్టేశారు. అప్పుడప్పుడూ విలన్లను ఫ్యాక్షనిస్టులుగా చూపించడమే తప్ప హీరోలు ఫ్యాక్షనిస్టులుగా కనిపించిన సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు. ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఇప్పుడు ఫ్యాక్షనిస్టు పాత్ర పోషిస్తుండటం విశేషం. నేను ట్రెండు ఫాలో అవ్వను.. ట్రెండు సెట్ చేస్తా అని చెప్పే పవన్.. ఎప్పుడో వదిలేసిన ట్రెండును ఇప్పుడు ఫాలో అవుతుండటం విచిత్రమే.
ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తాను చేయబోయేది ఫ్యాక్షన్ నేపథ్యమున్న లవ్ స్టోరీ అని ఇంతకుముందే పవన్ చెప్పాడు. ఐతే ఇందులో విలన్ ఫ్యాక్షనిస్టు అయి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ హీరోనే ఫ్యాక్షనిస్టు అని.. అతడి లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. పవన్ ఫ్యాక్షనిస్టు ఏంటబ్బా.. అతను ఆ పాత్రలో ఎలా ఉంటాడో.. అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జనాలు.
రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాల తరహాలో కాకుండా కాస్త భిన్నంగా.. లైటర్ వీన్ లో ట్రై చేస్తే ఇదో భిన్నమైన సినిమా అయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఐతే చాలా ఏళ్ల కిందటే జనాలకు మొహం మొత్తేసిన ఫ్యాక్షన్ సినిమాల స్టయిల్లోనే మళ్లీ పవన్ కూడా సినిమా చేస్తే మాత్రం చేదు ఫలితం ఎదురవడం ఖాయం. పైగా ఈ మధ్య బాగా ఔట్ డేట్ అయిపోయిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సినిమా చేస్తుండటం కూడా కొంచెం గుబులు రేపుతోంది. మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత హిట్టు కొట్టి తీరాల్సిన పరిస్థితుల్లో ఉన్న పవన్ ఏం డెలివర్ చేస్తాడో చూడాలి.