Begin typing your search above and press return to search.

ఖైదీని కొట్టేది పవనేనా!?

By:  Tupaki Desk   |   29 Sep 2017 5:30 AM GMT
ఖైదీని కొట్టేది పవనేనా!?
X
టాలీవుడ్ లో ఇప్పుడు రికార్డులన్నీ రెండు రకాలుగా విడిపోయిన మాట వాస్తవమే. గతంలో ఆల్ టైం రికార్డ్ అనే మాట మాత్రమే వినిపించేది. ఇప్పుడు దీనికి నాన్-బాహుబలి రికార్డ్ అనే మాట కూడా తోడైంది. నాలుగేళ్లకు పైగా కష్టానికి ఫలితం కావడంతో.. ఇప్పట్లో బాహుబలి సృష్టికర్త అయిన రాజమౌళి కూడా.. బాహుబలి రికార్డులను కొట్టడం కష్టమే.

అయితే.. తెలుగు సినిమా పరిశ్రమకు 100 కోట్ల షేర్ అనే మార్క్ అందని ద్రాక్ష మాదిరిగా చాలా కాలం ఊరించింది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150తో.. మాస్ మసాలా చిత్రంతో కూడా 100 కోట్లు కొట్టొచ్చని నిరూపించి.. తన సత్తా చాటారు చిరంజీవి. అప్పటి నుంచి ఈ 100 కోట్ల షేర్ మార్క్ అందుకునే సినిమా కోసం ఇండస్ట్రీ ఎదురుచూస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ కాటమరాయుడు.. అల్లు అర్జున్ డీజే.. ఎన్టీఆర్ జైలవకుశ.. మహేష్ బాబు స్పైడర్ చిత్రాలపై ఈ తరహా అంచనాలు నెలకొన్నాయి. వీటిలో మొదటి రెండు సినిమాలు ఈ మార్క్ అందుకోవడంలో ఫెయిల్ కాగా.. ఇప్పుడు జై లవకుశ.. స్పైడర్ ల పరిస్థితి కూడా అందుకు తేడాగా ఏమీ లేదు. బ్రేక్ ఈవెన్ కు రావడమే కష్టం అనుకునే టైంలో.. కొత్త రికార్డులను ఆశించడం అత్యాశే.

అయితే.. రాబోయే సినిమాల్లో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీపై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి రానున్న ఈ చిత్రం.. ఖైదీ రికార్డులను దాటే ఛాన్సులు ఉన్నాయని ఇండస్ట్రీ అంచనా. ఇటు పవన్ క్రేజ్.. అటు త్రివిక్రమ్ ఫ్యాక్టర్.. రెండూ కలిపి వర్కవుట్ అయితే.. నాన్ బాహుబలి రికార్డ్ ను అన్న నుంచి తమ్ముడు లాగేసుకునే అవకాశాలున్నాయి.