Begin typing your search above and press return to search.
పవన్ ప్యాకేజీపై ఈ గుసగుస నిజమా?
By: Tupaki Desk | 29 Jan 2020 1:30 AM GMTస్టార్ హీరోల పారితోషికం రేంజ్ నిరంతరం హాట్ టాపిక్. డే బై డే సెన్సెక్స్ పట్టీలు మారినట్టు హీరోల పారితోషికాలు చుక్కల్ని తాకుతున్నాయి. ఇప్పుడున్న అరడజను టాప్ స్టార్లు పాతిక కోట్లకు తగ్గకుండా తీసుకుంటున్నారు. ఆ పైన ఏరియా రిలీజ్ హక్కులు.. లాభాల్లో వాటాలు అంటూ చాలానే ప్యాకేజీలు అందుకుంటున్నారు.
ఇకపోతే పారితోషికాల విషయంలో ఇంతకుముందు సూపర్ స్టార్ మహేష్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య తీవ్రమైన పోటీ నడిచేది. ఆ ఇద్దరూ ఎప్పటికప్పుడు పారితోషికాల రేంజును పెంచేస్తూ పాతిక కోట్ల రేంజును రీచ్ అయ్యారు. నాలుగైదేళ్ల క్రితం నాటి మాట ఇది. అటుపై పవన్ రాజకీయాల వైపు వెళ్లడంతో ఆ ఇద్దరి మధ్యా పోటీకి తెర దించినట్టు అయ్యింది. ప్రస్తుతం మహేష్ పారితోషికం రేంజు చాలానే పెరిగింది. ఇంకా చెప్పాలంటే పారితోషికం కాస్తా ప్యాకేజీగా మారింది. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ తో రీఎంట్రీ ఇస్తుండడంతో మరోసారి పవన్ .. మహేష్ పారితోషికాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోసారి ఆ ఇద్దరి మధ్యా పారితోషికాల పరంగా వార్ కి తెరలేచినట్టేనా? అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పారితోషికం ఎంత? పింక్ రీమేక్ కోసం ఆయన ఏమేరకు డిమాండ్ చేస్తున్నారు? అని ఆరా తీస్తే పవన్ కి ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల ప్యాకేజీ ముట్టజెబుతున్నారని తెలుస్తోంది. అంత పెద్ద మొత్తం చెల్లించేందుకు చిత్రనిర్మాత దిల్ రాజుతో అంగీకారం కుదిరింది. ఇక పవన్ పారితోషికం విషయంలో తగ్గాల్సిందిగా దిల్ రాజు బతిమాలుకోవడంపైనా తాజాగా ఓ గుసగుస వినిపిస్తోంది. పింక్ రీమేక్ కి డబ్బింగ్ రైట్స్ కి అవకాశం లేదు.. హిందీ- తమిళంలో ఇప్పటికే జనం చూసేసిన సినిమా కాబట్టి పారితోషికాన్ని 35 కోట్ల రేంజుకు తగ్గాల్సిందిగా పవన్ ని కోరారట. అయితే అందుకు సీరియస్ అయిన పవన్ దిల్ రాజుపై రుసరుసలాడారని గుసగుస వినిపిస్తోంది. ఈ ప్రచారంలో నిజం ఎంత? అన్నది దిల్ రాజు కాంపౌండ్ వర్గాలే స్పందించాల్సి ఉంటుందేమో!