Begin typing your search above and press return to search.

అది వ‌ర్క్ షాప్ నా లేక ఫోటో షూటా?

By:  Tupaki Desk   |   1 Oct 2022 8:30 AM GMT
అది వ‌ర్క్ షాప్ నా లేక ఫోటో షూటా?
X
స్టార్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న లేటెస్ట్ పీరియాడిక‌ల్ డ్రామా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. క్రిష్ జాగ‌ర్ల‌మూడి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం ప్రారంభానికి ముందు సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఇప్ప‌టికీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే వుంది. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం.. మ‌రో ప్రొడ్యూస‌ర్ ఏ. ద‌యాక‌ర్ రావుతో క‌లిసి ఈ చారిత్ర‌క ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.

నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కీల‌క పాత్ర‌ల్లో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, న‌ర్గీస్ ఫ‌క్రీ, ఆదిత్య మీన‌న్‌, పూజితా పొన్నాడ‌, సుబ్బ‌రాజు, సునీల్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 17వ శ‌తాబ్ధంలోని మొఘ‌ల్ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. కోహినూర్ వ‌జ్రాన్ని చేజిక్కించుకునే గ‌జ‌దొంగ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నెవ‌ర్ బిఫోర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కెరీర్ లో న‌టిస్తున్న తొలి పీరియాడిక‌ల్ డ్రామా ఇది. అత్యంత భారీ స్థాయిలో విజువ‌ల్ ఫీస్ట్ గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తున్నారు. ఇటీవ‌లే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ప‌వ‌ర్ గ్లాన్స్ అభిమానుల‌తో పాటు సినీ ప్రియుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ప‌వ‌న్ ని ప్ర‌జెంట్ చేస్తున్న తీరు, ఆయ‌న పాత్ర‌ని మ‌లిచిన తీరు, భారీ సెట్టింగుల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా సినిమాని తెర‌పై ఆవిష్క‌రిస్తున్న తీరు అంచ‌నాల్ని పెంచేస్తోంది.

ఇదిలా వుంటే గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ విష‌యంలో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. త‌దుప‌రి షెడ్యూల్ ఇప్ప‌ట్లో వుంటుందా? ఉండ‌దా? అని వార్త‌లు షికారు చేస్తున్న నేప‌థ్యంలో వాట‌న్నింటికీ చెక్ పెడుతూ చిత్ర బృందం శుక్ర‌వారం త‌దుప‌రి షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ షెడ్యూల్ వ‌ర్క్ షాప్ ని నిర్వ‌హించింది. దీనికి సంబంధించిన వీడియోని కూడా విడుద‌ల చేసి సినిమా త‌దుప‌రి షెడ్యూల్ పై క్లారిటీ ఇచ్చేసింది.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. రెడ్ క‌ల‌ర్ హాఫ్ స్లీవ్స్ టీష‌ర్ట్, బ్లూ జీన్స్ ధ‌రించిన ప‌వ‌న్ లుక్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. వింటేజ్ లుక్ లో క‌నిపిస్తున్న ప‌వ‌న్ లుక్ ఆక‌ట్టుకుంటోవంది. అయితే ప్రీ షెడ్యూల్ వ‌ర్క్ షాప్ ఫ్రీగా అంతా సోఫాల‌పై కూర్చుని వుంటే ప‌వ‌న్ మాత్రం ఏదో ఫొటో షూట్ లో పాల్గొన్న‌ట్టుగా సోఫా ఎక్కి స్టైల్ గా కూన్చోవ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రీ షెడ్యూల్ వ‌ర్క్ షాప్ నా లేక ఫోటో షూటా? అని కామెంట్ లు చేస్తున్నారు.