Begin typing your search above and press return to search.

పవన్ పవర్ తో సైరా రచ్చ - వీడియో

By:  Tupaki Desk   |   19 Aug 2019 5:58 AM GMT
పవన్ పవర్ తో సైరా రచ్చ - వీడియో
X
రేపు విడుదల కాబోతున్న సైరా టీజర్ గురించి అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తుండగానే మరో ఊహించని సర్ప్రైజ్ ఈ రోజు కొణిదెల యూనిట్ అందించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీజర్ వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తాలూకు ఫోటోలు రెండు రోజుల క్రితమే వైరల్ అయ్యాయి. తాజాగా దీని తాలూకు వీడియో కూడా వచ్చేసింది. పవన్ స్వయంగా కారులో స్టూడియోకు రావడం అన్నదమ్ములు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకోవడం దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్కమ్ చెప్పడం లాంటివన్నీ ఇందులో ఉన్నాయి.

ఇక డబ్బింగ్ చెబుతున్నప్పుడు పవన్ చిరు రియాక్షన్లు మాములుగా లేవు. ముఖ్యంగా వీడియో చివర్లో పవన్ గొంతెత్తి సైరా నరసింహారెడ్డి అంటూ చెయ్యెత్తి మరీ చెప్పడం చూస్తే ఫ్యాన్స్ హావభావాలు ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఆ రేంజ్ లో గూస్ బంప్స్ వాళ్ళకు వస్తాయి మరి. ఇందులోనే స్క్రీన్ మీద పవన్ చూస్తూ డబ్బింగ్ చెబుతున్నప్పుడు సైరా పాత్రలో చిరు కళ్ళను చూపించి ఆ తర్వాత మట్టిని తడుముతున్న చేతులను ఆలా జస్ట్ రివీల్ చేసి వదిలేయడం కూడా మంచి కిక్ ఇచ్చింది.

చూస్తే పవన్ ఏదో మాములుగా డబ్బింగ్ చెప్పినట్టు లేదు. ఎమోషన్ ని ఫీలయ్యి అన్నయ్య చేస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం కాబట్టి ఆ ఫీల్ ని గుండెల నిండా నింపుకుని తన స్వరాన్ని అందించినట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ఇలా వీడియో రూపంలో మెగా బ్రదర్స్ బాండింగ్ చూసిన మెగా ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో దీన్ని ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. రేపు విడుదల కానున్న సైరా టీజర్ తాలూకు నిడివి అందులో విశేషాలు మాత్రం లీక్ కాకుండా కొణిదెల టీమ్ జాగ్రత్త పడుతోంది