Begin typing your search above and press return to search.
సర్దార్ ఆడియో: అన్నయ్య చెమట సువాసనే
By: Tupaki Desk | 20 March 2016 5:43 PM GMTఅసలు మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ ఒకటే స్టేజీపై వస్తున్నారంటేనే పెద్ద విషయం. ఇక అలాంటి స్టేజీపై తమ్ముడు పవన్ ను అన్నయ్య చిరంజీవి ఆకాశానికి ఎత్తేస్తే.. తమ్ముడు ఆయన గురించి ఏం చెప్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అలా చూసినవారందరికీ ఔరా అనిపించేలా.. రోమాలు నిక్కపొడుచుకునేలా.. ఆడిటోరియం దద్దరిల్లేలా స్పీచ్ ఇచ్చాడు పవన్. పదండి చూద్దాం.
హీరో అంటే చిరంజీవి ఒక్కరే---
''హీరో అంటే ఒక్క చిరంజీవి గారు తప్ప ఎవ్వరూ లేరు నాకెప్పుడు. అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టముండేది. కాని ఆయన హీరో అయ్యాక.. ఆయనొక్కరే నా హీరో. అలాంటి అన్నయ్య నన్ను యాక్టింగ్ చేయమంటే.. కాన్ఫిడెన్స్ రాలేదు. కాని ఈరోజున నేను ఇంత పెద్ద యాక్టర్ ను అయ్యి.. ఒక పొజిషన్ లో ఉన్నానంటే.. అందుకు మా అన్నయ్య.. మా వదినే కారణం'' అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఆయన చెమట కూడా సువాసనే---
''నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం అనే విషయాన్ని పది మంది ముందూ చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. కాని ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి నేను వెనకడుగు వేయను'' అంటూ తన అన్నయ్యపై ఎంత అభిమానం ఉందో చాటుకున్నారు పవన్. ''నేను చదువుకోకుండా.. ఇంట్లో తిని తిరుగుతుంటే.. అన్నయ్య మాత్రం ఎండల్లో కష్టపడుతూ.. తనకు సరిపోని షూస్ వేసుకొని.. కాళ్ళు వాసిపోయి.. ఇంటికి వచ్చిన ఆయన షూస్ తీసుకోలేక చతికిలపడితే.. ఆ కాలి సాక్స్ నేను తీసేవాడిని. ఆయన సాక్స్ తాలూకు చెమట వాసన నాకు సువాసనలా ఉండేది'' అని పవన్ చెబుతుంటే.. సభలో చాలామంది వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి.
మహా వ్యక్తి చిరంజీవి గారు---
''ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు.. ఫ్లాట్ ఫాం లేకుండా.. ఒక యాక్టర్ ను అవ్వాలి అనుకుని.. ఒక్కడే వచ్చి.. కష్టపడి.. ఈ స్థాయికి వచ్చి.. అందరికీ ఆదర్శంగా నుంచొని.. స్ఫూర్తిగా నిలిచున్నారు అన్నయ్య. అందుకే నాకు మా అన్నయ్య అంటే ఆయన చాలా ఇష్టం. నాలాంటి ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహా వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారికి జీవితాంత రుణ పడుతాం'' అంటూ మెగాస్టార్ గురించి పవర్ స్టార్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.