Begin typing your search above and press return to search.

సర్దార్ ఆడియో: పాలిటిక్స్‌ వేరు..అన్నయ్య దేవుడు

By:  Tupaki Desk   |   20 March 2016 5:57 PM GMT
సర్దార్ ఆడియో: పాలిటిక్స్‌ వేరు..అన్నయ్య దేవుడు
X
పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాన్‌ ఎప్పుడైతే ''జనసేన'' స్థాపించారో.. అప్పటినుండి అన్నయ్య చిరంజీవితో తనకు మనస్పర్ధలు పెరిగిపోయాననే రూమర్లు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి.. చిరంజీవి చాలాసార్లు మాట్లాడుతూ.. 'పాలిటిక్స్‌ లో రెండు వేర్వేరు దారుల్లో ఉండొచ్చు. కాని మేం ఎప్పటికే బ్రదర్స్‌' అని చాలాసార్లు చెప్పారు. అయితే ఇదే విషయం తమ్ముడు చెప్పట్లేదేంటి అంటూ ఒక డౌటు ఉండేది. అలాంటి డౌట్లు ఉంటే చెవుల్లో తుప్పు వదిల్చే ప్రయత్నం చేశాడు పవన్‌.

''అన్నయ్యకు పాలిటిక్స్‌ పరంగా ఆయనకు నచ్చని పని కూడా చేశాను. ఎ పరిస్థితుల్లో చేశాను.. ఎందుకు చేశానేది ఆయనకు ఎక్సప్లెయిన్‌ చేశాను. ఆయన కూడా అర్ధం చేసుకున్నారు. మా బంధం వేరు. రాజకీయాలు వేరు. అవి రెండు దార్లు. కాని అలాగని ఆయన స్థాయి తగ్గదు. ఆయన పంథాలో నేను లేకపోయినా మా అన్నయ్య నా గుండెల్లోనే ఉంటారు. ఆయన ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. పదే పదే ఇది నేను ప్రూవ్‌ చేసుకోవక్కర్లేదు. అవసరం వచ్చినప్పుడు ఆయన కోసం నేను నిలబడతాను. ఇది నేను చెప్పక్కర్లేదు. నా తల్లిదండ్రుల తరువాత నాకు తల్లిదండ్రులు మా అన్నయ్య వదిన'' అంటూ పవన్‌ తన గుండెల్లోని అభిమానం మరోసారి చాటుకున్నాడు. అప్పటికే ఒక వ్యక్తి కష్టం తాలూకు సువాసన అంటూ చిరంజీవి కాళ్ళకు ఉన్న సాక్సును తీసిన విషయాన్ని చెబుతూ.. అన్నయ్య అంటే ఎంత ఇష్టమో చెప్పాడు పవన్‌.

మెగాస్టార్‌ సంస్కారం గురించి చెబుతూ.. ''చిరంజీవి గారి సంస్కారం అద్భుతం.. ఒకసారి ఒక వారపత్రిక క్రింద పడిపోతే.. ఎవ్వరూ తీయట్లేదు.. దానిపై మన తోటి హీరో ఒకరి ఫోటో అచ్చయి ఉంది. తోటి యాక్టర్‌ ఫోటోను అలా పక్కనపడిపోతే తీయకుండా ఎలా ఉంటారు మీరు? అంటూ ఆయన మమ్మల్ని తిట్టి.. ఆ ఫోటోను ఆయనే తుడిచి పక్కన పెట్టారు. అది ఆయన సంస్కారం. అందరూ బాగుండాలని కోరుకునే చిరంజీవిగారి దగ్గర నుండి వచ్చిన వారం.. అదే సంస్కారంతో మసులుకుంటాం'' అంటూ పవన్‌ కళ్యాణ్‌ ఎనర్జటిక్‌ గా చెప్పుకొచ్చారు.