Begin typing your search above and press return to search.

అభిమానులకు షాక్... ప్రకాష్ రాజ్ ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్

By:  Tupaki Desk   |   5 April 2021 11:00 AM IST
అభిమానులకు షాక్... ప్రకాష్ రాజ్ ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్
X
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. రాజకీయంగా ఎన్నో సార్లు ప్రకాష్ రాజ్ పవన్ పై విమర్శలు చేసినా పవన్ ఆయన్ను పొగడటంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన పార్టీని ప్రారంభించి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాగా ఆది నుంచి నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రధాని మోదీని సైతం ఎన్నోసార్లు విమర్శించారు. కాగా కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఎంపీగా బరిలోకి దిగి ఓడిపోయారు.

కాగా ప్రకాష్ రాజ్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ పై కూడా పలుసార్లు విమర్శలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పవన్ సోదరుడు నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు.

కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ను పొగుడుతూ మాట్లాడారు. 'వకీల్ సాబ్ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతివాద లాయర్ గా నటించడం ఈ సినిమాకు మరింత బలం పెంచింది. ఎదురుగా ఒక బలమైన నటుడు ఉన్నాడంటే ఫర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా వస్తుంది. ప్రకాష్ రాజ్ ను ఈ సినిమాలో భాగం చేసిన దిల్ రాజుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాజకీయంగా నాది ప్రకాష్ రాజ్ ది విభిన్న మార్గాలే అయినప్పటికీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మేమంతా ఒక్కటే.

నన్ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ పలు ఛానల్స్ లో విమర్శలు చేశారు. అయినా నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాను. కానీ సినిమా పరంగా ప్రకాష్ రాజ్ నాకు ఇష్టమైన నటుడు. ఆయనంత గొప్ప నటుడు తెలుగు ఇండస్ట్రీకి దక్కడం ఎంతో అదృష్టం. ఆయనతో కలిసి సుస్వాగతం, బద్రి, జల్సా వంటి సినిమాల్లో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు' పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులకి, ప్రకాష్ రాజ్ కి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతుండగా ప్రకాష్ రాజ్ పై పవన్ పొగడ్తల వర్షం కురిపించడం ఫాన్స్ ని షాక్ కి గురి చేసింది.