Begin typing your search above and press return to search.

జల్సా ప్రయాణంలో జీవితపు విలువలు

By:  Tupaki Desk   |   3 May 2016 10:02 AM IST
జల్సా ప్రయాణంలో జీవితపు విలువలు
X
అందరి పేర్లు చెబుతూ దర్శకుడి పేరు చెప్పకపోవడంతో.. త్రివిక్రమ్ వెనకనుంచి అందించేందుకు ప్రయత్నించినపుడు.. మీ పేరు గుర్తుందండీ అంటూ త్రివిక్రమ్ తో పవన్ అనడం ఆడిటోరియంలో నవ్వులు పూయించింది. ''అ..ఆ'' ఆడియో వేడుకలో ఈ ముచ్చటైన దృశ్యం చోటుచేసుకుంది.

''మేం ఇప్పుడు స్నేహితులం అని చెప్పుకుంటున్నాం. కానీ.. గోకులంలో సీతకు ఆయన అసోసియేట్/అసిస్టెంట్‌ రైటర్‌.. పోసాని గారు రాకపోతే.. త్రివిక్రమ్ గారితోనే డైలాగ్స్ రాయించాం. అప్పట్లో ఆయన పేరు నాకు పెద్దగా తెలియదు కాని.. సగం పైగా ఆ సినిమా డైలాగులు ఆయనే రాశారు. అప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆ తరువాత నా తొలిప్రేమ టైములో ఆయన చిరునవ్వుతో వచ్చింది. నాకు నచ్చింది'' అంటూ వారి మధ్యన ఉన్న పాత కనెక్షన్‌ గురించి వివరించాడు పవన్‌.

త్రివిక్రమ్‌ గురించి ఇంకా చెబుతూ.. ''సినిమా తీయడమే కాదు.. నిజ జీవితంలో కూడా విలువలు పాటించే వ్యక్తి కాబట్టి ఇష్టం. జల్సా నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. కొంతమంది వృద్దులు నన్ను అభినందించినపుడు.. నేను ఒక నటుడిగా కేవలం రచయిత రాసిన డైలాగులు చెబుతున్నాను.. దానికే నాకు ఈ అదరణం అంటూ అనిపిస్తుంది. అలాంటి డైలాగులు రాస్తున్న త్రివిక్రమ్‌ గారంటే నాకు ఇష్టం. అలాంటి రచయిత ఉన్నందుకు తెలుగు సినీ పరిశ్రమ గర్విస్తుంది'' అని పవన్‌ చెప్పాడు.

పవన్‌ పై త్రివిక్రమ్‌ కురిపించిన పదాలపదనిసలు.. అలాగే పవన్‌ తన స్నేహితుడు గురించి చెప్పిన తాత్పర్యము.. ఆద్యంతం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ ఫ్రెండ్ షిప్‌ ఇలాగే కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం.