Begin typing your search above and press return to search.
పవన్ సినిమాకు గట్టిగానే పెట్టిస్తున్నాడు
By: Tupaki Desk | 8 Sep 2017 12:30 AM GMT#PSPK25 మొదటి సాంగ్ టీజర్ ఆల్రెడీ చాలా ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా అనిరుధ్ కంపోజ్ చేసిన 'బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీయో(3'0) క్లాక్' అనే ట్యూన్ బాగానే ఆకట్టుకుంది. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్తడే సందర్బంగా ఈ పాటను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలను గురించి చెప్పుకున్నప్పుడు అనిరుధ్ కంపోజ్ చేసే మ్యూజిక్ గురించి కూడా చెప్పుకోవాలి.
నిజానికి అనిరుధ్ పాటల్లో మనం చాలా రకాల వాయిద్యాల తాలూకు సౌండింగ్ వింటుంటాం. ఎందుకంటే మనోడు వయలిన్లలో ఎన్ని రకాలు ఉన్నాయో.. అన్నింటినీ తీసుకుని మ్యూజిక్ క్రియేట్ చేయిస్తాడు. ఇప్పుడున్న పరిజ్ఞానం వాడుకుంటే.. కీబోర్డు మీద ఏదో ఒకటి వాయించేసి.. దానిని గిటార్ సౌండ్ లా సింఫనీ సౌండులో మనం కంప్యూటర్ సాఫ్టువేర్ లో మార్చుకోవచ్చు. కాని అలా చేయకుండా ఒరిజినల్ వాయిద్యాలతోనే ఆ ధ్వనిని ప్రొడ్యూస్ చేయిస్తాడు అనిరుధ్. హాలీవుడ్ అంతా ఇలా ఒరిజినాల్టీని ఫాలో అవుతారు కాబట్టే.. హ్యాన్స్ జిమ్మర్ వంటి ప్రపంచమేటి సంగీత దర్శకుల మ్యూజిక్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. కాకపోతే మన సినిమాలకు అనిరుధ్ వంటి కంపోజర్లు అలా చేయడం కారణంగా.. బడ్జెట్ పెరుగుతంది. వాయించేవారికి సొమ్ములు ఇవ్వాలిగా మరి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం.. బడ్జెట్ పెరిగినా పర్లేదు కాని.. అలాంటి ఒరిజినల్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయమని అనిరుధ్ కు చెప్పాడట త్రివిక్రమ్. అందుకే ఎంతోమంది ఆర్కెస్ర్టా వారి సహకారంతో కాస్త ఖర్చు ఎక్కువవుతున్నా కూడా కత్తిలాంటి మ్యూజిక్ ఇస్తున్నాడట ఈ కుర్ర కంపోజర్. మరి తొలిసారి తెలుగులో చేస్తున్నాడు.. పైగా పవన్ కళ్యాన్ సినిమాకు చేస్తున్నాడు.. ఆ మాత్రం క్వాలిటీ ఉండాల్సిందే. అందుకోసం గట్టిగా కాసులూ పెట్టాల్సిందే.