Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ vs కరోనా రీ ఎంట్రీ..!
By: Tupaki Desk | 9 April 2021 10:41 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ''వకీల్ సాబ్'' సినిమా ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ళ తర్వాత పవన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులు థియేటర్స్ లో ఊగిపోయారు. నిన్నటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదని టాక్ వచ్చినా.. రిలీజ్ రోజు మాత్రం 'వకీల్ సాబ్' థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. కోవిడ్ ని సైతం లెక్క చేయకుండా ప్రేక్షకులకు థియేటర్లకు పోటెత్తినట్లు అర్థం అవుతోంది.
దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా రీ ఎంట్రీ ఇవ్వడంతో జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారా అనే ఆలోచనతో చాలా సినిమాలను వాయిదా వేసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిపిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికైతే 100 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. కాకపోతే కరోనా కారణంగా థియేటర్స్ ఫుల్ అవుతాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన 'వకీల్ సాబ్' వాటిని పటాపంచలు చేసింది.
'వకీల్ సాబ్' మొదటి ఆట నుంచే థియేటర్ల వద్ద జనాలు బారులు తీరారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీని కరోనా రీ ఎంట్రీ ఏమీ చేయలేదనుకునే విధంగా ఫ్యాన్స్ సందడి చేశారు. రీమేక్ సినిమా అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఎలాంటి హడావిడి కనిపిస్తుందో.. 'వకీల్ సాబ్' కు అలాంటిదే కనిపించింది. 6 రోజుల లాంగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ కు డోకా లేదు. రాబోయే రోజుల్లో ప్రేక్షకులు ఇలానే థియేటర్లకు వచ్చి.. ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనల్లో భాగంగా మళ్ళీ 50 శాతం ఆక్యుపెన్సీ తీసుకురాకపోతే 'వకీల్ సాబ్' మూవీ రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.