Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ట్వీట్ కు బదులిచ్చిన తమ్ముడు
By: Tupaki Desk | 9 April 2020 11:30 AM GMTసినీ పరిశ్రమలో భక్తిభావం అధికంగా ఉంది. అందుకే ఏకంగా ఫిలింనగర్ లో ఓ పెద్ద ఆలయమే ఉంది. ఆ ఆలయం సినిమాల ప్రారంభోత్సవానికి వేదికగా నిలుస్తోంది. ఇక దర్శకులు - సినీ నటీనటులు - ఇతర సినీ ప్రముఖులందరికీ భక్తిభావం మెండుగా ఉంది. వీరిలో కొణిదెల కుటుంబానికి అపార నమ్మకం ఉంది. ముఖ్యంగా చిరంజీవి ఆంజనేయుడికి వీర భక్తుడు. అందుకే అతడి చాలా సినిమాల్లో హనుమాన్ పాటలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో హనుమాన్ జయంతి వచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆంజనేయుడి మధ్య భక్తిభావం పెరగడానికి కారణం తెలిపారు.
"ఎవరో నా కలలోకి వచ్చి చిరంజీవి అని పిలిచినట్టు అనిపించిందని, ఆ తరువాతే శివ శంకర వర ప్రసాద్ కాస్తా చిరంజీవిగా మారాను " అని పలుమార్లు చిరంజీవి చెప్పుకున్న విషయం తెలిసిందే. ‘ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి. 1962లో నాకు ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది.. ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్నగారు - ఆ కనుబొమ్మలు - కళ్లు - ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి'' అన్నారంటూ ట్విటర్ లో చిరంజీవి తెలిపారు.
‘2002లో బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద reproduce చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా.. ఏంటోనండి ... బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి .. అలానే ఉంచేశాను ...మార్చలేదు " అని అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే'నంటూ ట్విట్టర్ లో చిరంజీవి తెలిపిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా దీనిపై చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ స్పందించాడు. "మా ఇంట్లో హనుమాన్ ను కొలవడం మా అన్నయ్య చిరంజీవిగారితోనే ప్రారంభమైంది.. మా అన్నయ్య వల్లే దేవుడిని నమ్మని ఓ కమ్యూనిస్ట్ వంటి మా నాన్నగారు రామభక్తుడిలా మారిపోయాడు.. నా టీనేజ్‌లోనే నేను కూడా హనుమాన్ చాలీసా చదివేవాడిని.. జై హనుమాన్' అంటూ ట్వీట్ చేశాడు.
ఈ విధంగా సోదరులు తమ కుటుంబంలో హనుమంతుడి పాత్రపై బహిరంగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల చిరంజీవి ట్విట్టర్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.