Begin typing your search above and press return to search.

పాసులు లేకపోతే రావద్దు -పవన్‌ కళ్యాణ్‌

By:  Tupaki Desk   |   19 March 2016 5:16 PM IST
పాసులు లేకపోతే రావద్దు -పవన్‌ కళ్యాణ్‌
X
''దయ చేసి పాసులు లేని అభిమానులు ఎవ్వరూ కూడా ఆడియో వేదిక దగ్గరకు రావొద్దు. మీరు గుమిగూడితే ఆసాంఘిక శక్తులు అక్కడ తలదాచుకొని ఏదన్నా అసంఘటిత చర్యలకు పాల్పడతారేమో అని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మీరు ఇంటి దగ్గరే టివిల్లో చూడండి. నోవోటెల్‌ హోటల్‌ దగ్గరకు మాత్రం రావొద్దు'' అంటూ పవన్‌ కళ్యాన్‌ విన్నవించుకున్నాడు.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు హడావుడిగా ప్రెస్‌ మీట్‌ ఎరేంజ్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌.. తన అభిమానులకు ఈ విషయం తెలియజేయడానికి ప్రెస్‌ మీట్‌ పెట్టానని చెప్పారు. ''అస్సలు ఇన్నేసి సెక్యూరిటి ఇష్యూలు.. ఉన్నప్పుడు ఆడియో ఫంక్షన్‌ క్యాన్సిల్‌ చేసేద్దాం అనుకున్నాం. కాకపోతే.. పొలిటికల్‌ లీడర్లకు మీటింగులు ఎంత ముఖ్యమో.. సినిమా రిలీజ్‌ కు ముందు ఆడియో ఫంక్షన్‌ అంత ముఖ్యం. అందుకే నేను కూడా అదే ట్రేడ్‌ నార్మ్‌ ఫాలో అవుతున్నాను. సో.. మీరందరూ నా విన్నపాన్ని మన్నించండి'' అంటూ పవన్‌ ముగించారు.

సర్దార్ మూవీ ఆడియో లాంచ్‌ రేపు సాయంత్రం (మార్చి 20న) నోవోటెల్‌ హోటల్‌ ఆడియోటోరియంలో జరుగుతోంది.