Begin typing your search above and press return to search.

సర్కార్ వివాదం.. సినిమాలపై పవన్ హింట్

By:  Tupaki Desk   |   27 Nov 2018 11:34 AM IST
సర్కార్ వివాదం.. సినిమాలపై పవన్ హింట్
X
రాజకీయాల్లోకి వచ్చాక పవన్ సినిమాల కాడి వదిలేశాడు.. అధికారం కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. వచ్చే మేలో జరిగే ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సరే జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నాడు. ఇక సినిమాలు చేయడేమో అని ఆందోళన చెందిన అభిమానులకు తీపి కబురునందించేలా తాజాగా మాట్లాడారు. పవన్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఇటీవల చెన్నైలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ - గన్నవరంలో జరిగిన సభలో పవన్ ఆసక్తికరంగా మాట్లాడారు. తన సినిమాల ప్రయాణంపై పవన్ సూచన చేశారు. ఇటీవల తనను సినిమా చేసి పెట్టమని కొందరు తెలిసిన వాళ్లు వచ్చారని.. పార్టీ నడిపేందుకు డబ్బు కావడంతో అవసరమైతే సినిమాలు చేయమని నా బంధువులు - స్నేహితులు కొందరు సూచిస్తున్నారని పవన్ అన్నట్లుగా చెప్పుకొంటున్నారు. ఎంజీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పార్టీ అవసరాల కోసం సినిమాలు చేసేవారని పవన్ తెలిపారని వార్తలు వస్తున్నాయి. ఇలా పార్టీ కోసం మరోసారి సినిమాలు చేసేందుకు పవన్ అంగీకరించడం తెలుగునాట ప్రస్తుతం గుడ్ న్యూస్ గా మారిందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.

ఇటీవల చెన్నైలో పర్యటించిన పవన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ నటించిన ‘సర్కార్’ వివాదంపై స్పందించారు. వివాదాలు సృష్టించేవారికి సినిమాలే టార్గెట్ అని.. అందుకే సర్కార్ ను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చాడు. సర్కార్ చిత్రం తమ ప్రతిష్టని దిగజార్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు - నేతలు విజయ్ చిత్రాన్ని అడ్డుకొని రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. దీన్ని తప్పు అని పవన్ వ్యాఖ్యానించారు. గతంలో తన చిత్రాలకు కూడా ఇలా వివాదం చేశారని వివరించారు. కొమురం పులి చిత్రంలో కూడా ఓ డైలాగ్ వాడినందుకు పెద్ద వివాదం చేశారని తెలిపారు. సర్కార్ చిత్రంలో చూపిన అలాంటి పోరాటాలు చేయాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ వెల్లడించారు.