Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ కాసేపు టెన్షన్ పెట్టేశాడుగా!
By: Tupaki Desk | 20 Jan 2017 7:14 AM GMTతమిళనాడులో సాగుతున్న జల్లికట్టు రగడ తెలుగు రాష్ట్రాల్నీ తాకింది. ఇక్కడ కూడా పలు గ్రామాల్లో పండగలప్పుడు ఎడ్ల ప్రదర్శనలు జరుగుతుంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ జల్లికట్టుకి మద్దతు లభిస్తోంది. చాలా మంది ఓపెన్ గా ముందుకొచ్చి ఆందోళనకారులకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా జల్లికట్టుపై పెద్దయెత్తున స్పందిస్తుండడం విశేషం. మహేష్ బాబు - పవన్ కల్యాణ్ లాంటి స్టార్ కథానాయకులు జల్లికట్టుగా మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే మహేష్ బాబు జల్లికట్టు గురించి నేరుగా ట్వీటాడు.
పవన్ ట్వీట్లు మాత్రం ఒక సస్పెన్స్ సినిమాని తలపిస్తున్నట్టుగా వచ్చాయి. ఆయన ట్వీట్లని గమనిస్తూ వచ్చిన నెటిజన్లకి చాలాసేపటి వరకు పవన్ జల్లికట్టుకి మద్దతు ప్రకటిస్తాడో - లేక తిరస్కరిస్తాడో అర్థం కాని పరిస్థితి. నాకు మన సంస్కృతి - ప్రకృతి - జంతువులపై ఎంత గౌరవముంది... అంటూ ట్వీట్లు మొదలుపెట్టాడు పవన్. తాను జీవామృతంతో పంటలు పండిస్తుంటానని ఒకసారి, నా గోశాలలో పలు గోవులు ఉన్నాయని - వాటిని చూశాకే జల్లికట్టు గురించి ఆలోచించానని మరొకసారి ట్వీటుతూ వచ్చాడు. ఆ సరళిని చూసిన చాలామంది పవన్ కళ్యాణ్ జల్లికట్టుని వ్యతిరేకిస్తుండొచ్చు అనుకొన్నారు. కానీ చివరికి ఆయన కూడా క్లియర్ కట్‌గా జల్లికట్టుని రద్దు చేయడమనేది దక్షిణ భారతదేశంపై జరుగుతున్న ఓ దాడి అని, జల్లికట్టులో జంతు హింస అనేది ఓ సాకు మాత్రమే అన్నట్టుగా ఆయన ట్వీటాడు. మొత్తంగా పవన్ కళ్యాణ్ జల్లికట్టు మద్దతు ప్రకటించడంతో ఇప్పుడు తమిళ తంబీలు ఖుషీ అవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/