Begin typing your search above and press return to search.
మీరిలా.. రేణూ అలా.. ఎలా పవన్ కల్యాణ్?
By: Tupaki Desk | 14 Aug 2018 7:16 AM GMTతన మూడు పెళ్లిళ్లకు సంబంధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకేం ఒళ్లు పొగరెక్కి మూడు పెళ్లి చేసుకోలేదని.. పెళ్లిళ్లు తన కర్మగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తనకు తానే తెచ్చిన పవన్.. ఏం చేయను? మంచో చెడో జరిగిందని.. తనకేం ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదన్న ఆయన.. తనతో ఉండాలంటే ఎవరికైనా కష్టమేనని చెప్పారు. తాను బయటోళ్ల కోసం ఏడుస్తూ ఉంటానని.. వీళ్లకేమైంది.. వాళ్లకేమైందని బాధ పడుతూ ఉంటానని.. అలాంటి తనతో ఎవరు మాత్రం ఉంటారని వ్యాఖ్యానించారు.
తన జీవితంలో పార్టీలు.. పబ్ లు ఉండవని.. ఎప్పుడూ ఒక గదిలో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉంటానని.. అలా కాకుంటే ఆవుల దగ్గరో.. గేదెల దగ్గరో ఉంటానని.. లేదంటే ఎవరితోనో మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. అలా అని తన దగ్గర ఉండే వారికి సుఖం ఏముంటుందని ప్రశ్నించారు.
అందరూ తనను సినిమా యాక్టర్ అంటారని.. కానీ.. తాను మాత్రం ఎప్పుడూ ఒంటరినన్నట్లుగా మాట్లాడారు. తనతో ఉండే వారికి ఎప్పుడూ ఒత్తిడి ఉంటుందని.. అందుకే తన వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అయ్యిందన్నారు. ఇలా అయినందుకు తానూ ఏడ్చానని.. ఆడపడుచులు.. అక్కాచెల్లెళ్లతో పెరిగిన వాడినని.. అందరిని ఎక్కువగా అర్థం చేసుకుంటానని చెప్పారు. కొన్ని పరిస్థితుల వల్ల మూడు పెళ్లిళ్లు జరిగాయన్న పవన్ మాటలు ఈ రీతిలో ఉంటే.. ఆ మధ్యన ఆయన మాజీ భార్య రేణూ ఒక ఇంటర్వ్యూలో తమ వైవాహిక బంధంలోనే ఉన్నప్పుడు వేరే మహిళ ద్వారా పాప పుట్టిందన్న అర్థం వచ్చేలా మాట్లాడటం గుర్తే ఉంటుంది. తన జీవితంలో చాలా బోరింగ్ అని చెబుతున్న పవన్.. ఒక్కసారి వీలు చేసుకొని రేణూదేశాయ్ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే బాగుంటుందేమో. అప్పుడు తను చెప్పే మాటలు మ్యాచ్ అయ్యే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు పలువురు చేస్తున్నారు.