Begin typing your search above and press return to search.
సర్దార్ గబ్బర్ సింగ్.. ఏ ఊరి పోలీసబ్బా??
By: Tupaki Desk | 19 Oct 2015 11:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్నే అందుకుంది. ఈ సినిమా పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా రికార్డులకెక్కింది. ఇప్పుడు మరోసారి అలాంటి రికార్డ్ ని రిపీట్ చేసే పట్టుదలతో ఉన్నాడు పవన్. అందుకే సర్ధార్ గబ్బర్ సింగ్ పై 200 శాతం కాన్ సన్ ట్రేట్ చేశాడు.. అయితే స్టేట్ డివైడ్ తర్వాత వస్తున్న సినిమాగా ఈ సినిమాలో పవన్ వేస్తున్న పోలీస్ గెటప్ పై బోలెడంత డిష్కసన్..
గబ్బర్ సింగ్ టైమ్ కి రాష్ర్టం రెండు ముక్కలు అవ్వలేదు. ఒకటిగా ఉంది. కానీ ఆ తర్వాత రెండు ముక్కలు అయిన తర్వాత పవన్ ఈ సినిమా సీక్వెల్ మొదలెట్టాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ ఆన్సెట్స్ ఉందిప్పుడు. హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతోంది. అయితే పవన్ స్టేట్ డివైడ్ లేనప్పుడు ఏపీ పోలీస్ గా కనిపించాడు. గబ్బర్ సింగ్ రూపం - ఆహార్యం - భాష అన్నీ ఏపీ పోలికలే. అయితే అప్పటి సీన్ వేరు. ఇప్పటి సీన్ వేరు. మారిన పరిస్థితుల్లో అతడు ఏ పోలీస్ గా కనిపించాలి? తెలంగాణ పోలీస్ గానా? లేక ఏపీ పోలీస్ గానా? అతడు తెలంగాణలో ఉంటూ ఏపీ పోలీస్ గా కనిపిస్తే ఎలా?
అందుకే తెలివిగా రెండు రాష్ర్టాల పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. చొక్కా బటన్ విప్పి, బనియన్ చూపిస్తూ తెలంగాణ యాసలో కొంచెం సేపు.. ఆంధ్ర యాసలో కొంచెం సేపు అతడు మాట్లాడుతాడుట. అంతేకాదు.. సినిమాలో మనోడు ఏదో హైదరాబాద్ పోలీస్.. విజయవాడ పోలీస్ టైపులో.. రత్తన్ పూర్ పోలీస్ అంటూ దర్శనమివ్వబోతున్నాడు. అది సంగతి.