Begin typing your search above and press return to search.

పవన్ అంత వరకు గర్వపడొచ్చు

By:  Tupaki Desk   |   13 April 2016 5:30 PM GMT
పవన్ అంత వరకు గర్వపడొచ్చు
X
పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి సినిమా వచ్చిందంటే టికెట్ల కోసం ఎంత పోటీ ఉంటుందో.. థియేటర్లు ఎలా నిండిపోతాయో అందరికీ తెలిసిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలోనూ అలాంటి హడావుడే కనిపించింది. కానీ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి పరిస్థితి మారిపోయింది. ఆల్రెడీ టికెట్లు బుక్ అయిపోవడం వల్ల వీకెండ్ వరకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేకపోయింది. కానీ సోమవారం నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. చాలా చోట్ల థియేటర్లు తగ్గిపోయాయి. తిరిగి ‘ఊపిరి’ సినిమాను నడిపించడం మొదలైంది. కొన్ని చోట్ల ‘సావిత్రి’ సినిమాను కూడా రీప్లేస్ చేశారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిస్థితే చూస్తే.. తొలి రోజు అక్కడ నాలుగు పెద్ద థియేటర్లలో ‘సర్దార్..’ను రిలీజ్ చేశారు. కానీ రెండో రోజుకు ఒక థియేటర్ తగ్గించేశారు. వీకెండ్ అయ్యాక కలెక్షన్లు దారుణంగా పడిపోవడంతో ఇంకో థియేటర్ కూడా తగ్గించేయాల్సి వచ్చింది. ఇప్పుడు రెండు థియేటర్లలో కూడా కలెక్షన్లు అంతంతమాత్రంగా ఉన్నాయి. రెండు థియేటర్ల కలెక్షన్లు కలిపినా ఒక థియేటర్ హౌస్ ఫుల్ అయితే వచ్చేంత కూడా లేవు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఫస్ట్ వీకెండ్ లో సినిమా రూ.40 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. ఫుల్ రన్లో ఇంకో 10-15 కోట్ల దాకా కలెక్షన్లు రావచ్చేమో. కనీసం రూ.30 కోట్లకు తక్కువ కాకుండా బయ్యర్లకు బ్యాండ్ పడటం ఖాయం. నాన్-బాహుబలి రికార్డులన్నీ తుడిచేస్తాడనుకున్న పవన్.. చివరికి నష్టాల విషయంలో రికార్డు కొట్టేలా ఉన్నాడు. ఐతే ఫ్లాప్ అనిపించుకున్న సినిమాకు కూడా రూ.50 కోట్ల మార్కును అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా ఓ ప్రౌడ్ రికార్డు పవన్ ఖాతాలో పడబోతోంది. అదొక్కటే పవన్ అభిమానులకు సంతోషించదగ్గ విషయం.