Begin typing your search above and press return to search.

సర్దార్ రన్ టైం ఎక్కువేనంటగా!!

By:  Tupaki Desk   |   5 April 2016 9:49 AM GMT
సర్దార్ రన్ టైం ఎక్కువేనంటగా!!
X
ప్రస్తుతం ఏ సినిమాకైనా డ్యురేషన్ కీలకంగా అయిపోయింది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల కల్చర్ పెరిగాక.. 3 గంటల సినిమా అన్న మాటే జనాలు మర్చిపోయారు. అందుకే మెజారిటీ సినిమాలు రెండు నుంచి రెండున్నర గంటల మధ్యలోనే డ్యురేషన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మూవీలో ఎక్కడా ల్యాగ్ లేకుండో.

బోర్ అనిపించకుండా ఉండేందుకు కూడా రన్ టైం విషయంలో అలర్ట్ గా ఉంటున్నారు మేకర్స్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం ఈ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. సర్దార్ కి రన్ టైం ఎక్కువేనట. 161 నిమిషాల 42 సెకన్ల డ్యురేషన్ ఉంటుందిట ఈ మూవీ. అంటే రెండున్నర గంటల మార్క్ ను సర్దార్ దాటేశాడని అర్ధమవుతుంది. ఒకరకంగా ఇంత పెద్ద సినిమా అంటే రిస్క్ అంటారు కానీ... అన్ని సార్లు అలాగే అని చెప్పలేం. ఎందుకంటే.. రీసెంట్ గా బాహుబలి ది బిగినింగ్ - శ్రీమంతుడు చిత్రాలు డ్యురేషన్ ఎక్కువ ఉన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

అంటే మూవీలో కంటెంట్ ఉన్నప్పుడు.. డ్యురేషన్ పెద్ద మ్యాటర్ కాదనే విషయం అర్ధమైపోతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఎలాగూ ఎంటర్టెయిన్మెంట్ బేస్డ్ గా చిత్రం కావడం, అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో.. పవన్ మార్క్ సన్నివేశాలు చకచకా కనిపిస్తే చాలు.. ఇండస్ట్రీ హిట్ అయిపోతుందనే టాక్ ఉంది.