Begin typing your search above and press return to search.
ఇక్కడ కూడా దంచుతావా పవన్?
By: Tupaki Desk | 15 March 2016 7:30 PM GMTఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. ఎలాగో బాలీవుడ్ మీడియాకు ఒక పెద్ద ఇంటర్యూ ఇచ్చేశాడు. సో.. సినిమా రిలీజ్ లకు ముందు ఇంటర్యూలు ఇవ్వడూ (అంటే రిలీజ్ అయ్యాక కూడా ఇవ్వడులే) అనే సెంటిమెంట్ ఏమీ లేదు. అలాంటప్పుడు తెలుగు మీడియాలో కూడా దంచేస్తాడా మరి?
నిజానికి బాహుబలి అండ్ శ్రీమంతుడు ప్రభావం మన సినిమాల మీద ఎలా ఉందో ఇప్పుడు ''సర్దార్'' అనురిస్తున్న స్ర్టాటజీ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే.. అదనపు ప్రమోషన్లు.. ఇంకా చెప్పాలంటే కాస్త శృతిమించిన ప్రమోషన్ల కారణంగా.. ఈ రెండు సినిమాలకూ విపరీతమైన కలెక్షన్లు వచ్చేశాయి. ముఖ్యంగా శ్రీమంతుడు సినిమానైతే మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఎన్నో ఇంటర్యూలు ఇచ్చి ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్లు మీద కనిపించింది. చూస్తుంటే.. ఇప్పుడు సర్దార్ సినిమాను 80+ కోట్లు వెచ్చించి కొనుకున్న ఈరోస్ సంస్థ కూడా ఇలాగే పవన్ తో కూడా ప్రమోట్ చేయిస్తారేమో అనిపిస్తోంది.
మరి బాలీవుడ్ కు ఇంటర్యూ ఇచ్చిన పవన్.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చిన్న చిన్న టివి ఛానళ్ళకు సైతం ఇంటర్యూలు ఇచ్చేసి సర్దార్ ను సూపర్ సక్సెస్ చేస్తాడా? చూద్దాం.