Begin typing your search above and press return to search.
పవన్ కి శ్రుతి హ్యాండిచ్చిందా?
By: Tupaki Desk | 2 Jun 2016 4:06 AM GMTగబ్బర్ సింగ్ జోడీని మరోసారి తెరపై చూసుకోవాలన్న అభిమానుల ఆశలు ఆడియాశలే కానున్నాయా? పవన్ కళ్యాణ్ సినిమా నుంచి శ్రుతిహాసన్ తప్పుకొందా? ఇప్పుడు మరో కథానాయికని ఎంపిక చేసేందుకు చిత్రబృందం అన్వేషణ సాగిస్తోందా? ఈ ప్రశ్నలకి ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపోమాపో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. హీరోయిన్ గా శ్రుతిహాసన్ ని ఎంపిక చేసినట్టు కూడా చిత్రబృందం ప్రకటించింది. ఇక పవన్ కి అంతా సెట్టయిపోయినట్టే అనుకొన్న తరుణంలో మరో వార్త బయటికొచ్చింది.
పవన్ సినిమా కోసం కథానాయికల్ని సంప్రదిస్తున్నారన్నదే ఆ వార్త. ఆల్రెడీ శ్రుతి సెలెక్ట్ అయ్యింది కదా, కొంపదీసి ఆమెతో పాటు సినిమాలో మరో హీరోయిన్ కి కూడా చోటుందా? అని ఆరా తీయగా... సినిమాలో ఒకే హీరోయిన్ అనే తేలిందట. అయినా హీరోయిన్ కోసం అన్వేషిస్తుండడం చూసి శ్రుతి హ్యాండ్ ఇచ్చుంటుందని డౌట్ పడుతున్నారంతా. ఇటీవల కీర్తి సురేష్ ని సంప్రదించారట. అయితే ఆమె కాల్షీట్లు లేవని తేల్చడంతో ఎస్.జె.సూర్య మరొక కథానాయికని సంప్రదించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయినా హీరోయిన్ కోసం చిత్రీకరణ ఆపొద్దని, ఆలోగా తీయాల్సిన సన్నివేశాలు తీద్దామని పవన్ చెప్పాడట. దీంతో త్వరలోనే చిత్రబృందం పొలాచ్చి వెళ్లబోతోందని సమాచారం. ఇదేగనక నిజమైతే శ్రుతి ప్లేస్ లో పవన్ సరసన నటించే ఛాన్స్ ఎవరు కొడతారో చూడాలి.