Begin typing your search above and press return to search.

అప్పుడు జానీ, ఇప్పుడు సర్దార్.. అదే ఏప్రిల్

By:  Tupaki Desk   |   20 April 2016 5:34 PM GMT
అప్పుడు జానీ, ఇప్పుడు సర్దార్.. అదే ఏప్రిల్
X
ఓ 13ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. 2003 ఏప్రిల్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిన జానీ సినిమా రిలీజ్ అయింది. తనే డైరెక్షన్ చేసి మరీ రెండేళ్ల పాటు కష్టపడి తెరకెక్కించిన జానీ.. చివరకు డిజాస్టర్ గా మిగిలింది.

మళ్లీ ఇన్నేళ్లకి పవన్ అన్నీ తానై తీసిన మూవీ సర్దార్ గబ్బర్ సింగ్. తనే స్టోరీ - స్క్రీన్ ప్లే రాసి మరీ దగ్గరుండి సర్దార్ ని తెరకెక్కించాడు. అయితే.. పదంటే పది రోజుల్లో 50 కోట్ల మార్క్ అందుకుని కూడా అతిపెద్ద డిజాస్టర్ అనిపించుకుంది సర్దార్ గబ్బర్ సింగ్. ఇప్పుడీ సినిమా నష్టాలను భర్తీ చేయడం అన్నది హాట్ టాపిక్. ఇప్పటివరకూ ఎవరూ పైకి మాట్లాడకపోయినా.. లోలోపన డిస్ట్రిబ్యూటర్లు బాగానే బాధ పడుతున్నారు. నిర్మాతలతో మాటామంతీ నడిపిస్తున్నారు.

సర్దార్ నిర్మాతలు ముగ్గురు. ఒకరు పవన్ - రెండు శరత్ మరార్ - మూడు ఈరోస్ ఇంటర్నేషనల్. కార్పొరేట్ కంపెనీ అయిన ఈరోస్ నుంచి.. రూపాయి రాలే ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు లాస్ వచ్చిన 30 కోట్లు తిరిగివ్వడం పవన్-శరత్ మరార్ ల వల్ల అయ్యే పని కాదు. అందుకే నెక్ట్స్ పిక్చర్ ని తక్కువ రేటుకే ఇస్తామనే ప్రపోజల్ ముందుక వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే.. పవన్ సినిమా అంటే ఎప్పటికి మొదలవ్వాలి, ఎప్పటికి పూర్తవ్వాలి అని అనుకుంటున్నారట చాలా మంది. ఇంతకీ.. పవన్ కి ఇంతటి కెరీర్ ఫ్లాప్ లను అందించిన ఏప్రిల్ నెల... ఖుషీ - జల్సా లాంటి బ్లాక్ బస్టర్స్ ను కూడా ఇచ్చింది. అందుకే ఏప్రిల్ పవన్ కి కలిసొచ్చిందని అనాలో.. చేటు చేసిందని అనాలో అర్ధం కాని పరిస్థితి.