Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ వెరీ సీరియస్
By: Tupaki Desk | 8 Jan 2016 11:30 AM GMTపవన్ కళ్యాణ్ తనేదో తన పనేదో అన్నట్లే ఉంటాడు కానీ.. మెగా ఫ్యామిలీ వ్యవహారాల్ని మరీ పట్టించుకోకుండా ఏమీ ఉండడు అంటారు అతడి సన్నిహితులు. పైగా ఈ మధ్య అన్నయ్య విషయంలో పవన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సంగతి జనాలకు కూడా అర్థమవుతోంది. ‘బ్రూస్ లీ’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడంపై ఇంటికెళ్లి మరీ అన్నయ్యను అభినందించి రావడమే కాక.. సర్దార్ సెట్లో అబ్బాయి చరణ్ తో సరదాగా గడపడం గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ అన్నయ్య చిరంజీవితో విభేదాల విషయంలో ఈ మధ్య ఓ వర్గం మీడియాలో అదే పనిగా వ్యతిరేక వార్తలు వస్తుండటంతో పవన్ చాలా సీరియస్ అయినట్లు తెలిసింది.
ఈ మధ్యే తన అనుచరులతో ఓ మీటింగ్ పెట్టి ఈ వార్తల వెనుక ఉద్దేశమేంటో కనుక్కోమని చెప్పినట్లు పవన్ సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ వార్తలు రాయిస్తూ ప్రచారంలోకి తెస్తున్నారేమో పరిశీలించాలని పవన్ చెప్పాడట. ముఖ్యంగా వెబ్ - ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని వర్గాలు అదే పనిగా తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తుండటం పట్ల పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి వార్తలపై స్పందించడం ఎందుకులే అని ఓపిగ్గా ఉండే కొద్దీ అవతలి వాళ్లు మరింత రెచ్చిపోతున్నారంటూ పవన్ సీరియస్ అయినట్లు సమాచారం.