Begin typing your search above and press return to search.
ఒక్క రోజులో తేల్చండి - పవన్ హెచ్చరిక
By: Tupaki Desk | 20 April 2018 12:10 PM GMTనిన్నరాత్రి వరుస ట్వీట్లతో షేక్ చేసిన పవన్ కల్యాణ్... ఈరోజు ఫిలిం ఛాంబర్ లో ప్రత్యేక్షమై సందడి చేశారు. పవన్ మీడియాతో మాట్లాడతారని చాలాసేపు ఎదురుచూసినా... ఆయనేం చెప్పకుండానే వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ కి తోడుగా ఆయన అన్న నాగబాబు- మేనల్లుడు అల్లుఅర్జున్- వరుణ్ తేజ్- సాయి ధరమ్ తేజ్- శిరీష్- రామ్ చరణ్- వినాయక్ తదితరులు ఫిలిం ఛాంబర్ కి వచ్చి ఆయన్ని కలిసారు.
శ్రీరెడ్డి- రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో ఫిల్మిం ఛాంబర్ కల్పించుకుని ఒక్కరోజులో ఏదో ఒకటి తేల్చాలని పవన్ డెడ్ లైన్ ఇచ్చారు. శ్రీరెడ్డి తిట్టిన విషయంపై న్యాయ పోరాటం చేయబోతున్నారనే సమాచారంతో టాలీవుడ్ లో ఓ రకమైన వాతావరణం నెలకొంది. ఆర్‌జీవీ శిష్యుడు పూరీ జగన్నాథ్ తో సహా హీరోలు- నటీనటులు దర్శకులు కూడా అందరూ పవన్ వైపు ఉన్నారు. దీంతో ఆయన ఎటువంటి సంచలన ప్రకటన చేయబోతున్నారో అని అందరూ ఎదురుచూశారు. ఫిలిం ఛాంబర్ సభ్యులతో సమావేశమైన పవన్ కల్యాణ్... మా అసోసియేషన్ కీ ఫిలిం ఛాంబర్ కీ టాలీవుడ్ లో జరుగుతున్న రాద్ధాంతానికి ముగింపు పలకడానికి ఒక్కరోజు గడువు ఇచ్చారు. ఒకవేళ డెడ్ లైన్ లోగా అంటే రేపటిలోగా ఛాంబర్ పెద్దలు స్పందికపోతే... జనసేన అధినేత తీసుకోబోయే చర్యలను ప్రకటించబోతున్నాడు...
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా శ్రీరెడ్డి వ్యవహారంతో టాలీవుడ్ లో జరుగుతున్న రచ్చకు త్వరగా ముగింపు పలకాలని చిరంజీవినీ- మెగా కుటుంబాన్ని కోరినట్టు సమాచారం. మా అసోసియేషన్ గానీ- ఫిలిం ఛాంబర్ సభ్యులు గానీ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. పవన్ కల్యాణ్ ని తిట్టిన శ్రీరెడ్డిపై.. తిట్టించిన రామ్ గోపాల్ వర్మపై ఛాంబర్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.