Begin typing your search above and press return to search.
డైరెక్టర్ లేకుండానే... నటించేస్తున్న పవన్!
By: Tupaki Desk | 10 March 2017 11:39 AM GMTటాలీవుడ్ అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్... కేవలం నటుడే అనుకుంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే... తన మాజీ భార్య రేణు దేశాయ్‌తో గతంలో ఆయన తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం హిట్ కాకపోయినప్పటికీ... పవన్ కెరీర్ లో ఓ అద్భుత చిత్రంగానే నిలిచిపోయింది. ఇదంతా గతం అనుకుంటే...ప్రస్తుతం పవన్ కల్యాణ్ *కాటమరాయుడు* చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రం బృందం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది.
అయితే చిత్రం షూటింగ్ జరుగుతుండగానే... జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్... సదరు షూటింగ్ కు పలుమార్లు విరామం పలకాల్సి వచ్చింది. తన రాజకీయ పార్టీ కార్యక్రమాలు, జనం తనకోసం తరలివస్తున్న తరుణంలో నాన్ స్టాప్‌గా చిత్రం షూటింగ్ లో పాలుపంచుకునే విషయంలో పవన్ సక్సెస్ కాలేకపోయారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న చిత్ర నిర్మాతలు గానీ, డైరెక్టర్ గానీ పవన్‌ను ఏమీ అనలేని పరిస్థితి. అలాగని ముందే ప్రకటించిన తేదీ నాటికి చిత్రాన్ని విడుదల చేయలేకపోతే ఎలాగన్న ఆందోళన కూడా వారిలో లేకపోలేదు.
ఈ విషయాన్ని పసిగట్టాడో? ఏమో తెలియదు గానీ... పవన్ కల్యాణ్ లోని డైరెక్టర్ మేల్కొన్నాడు. ప్రస్తుతం ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న డాలీ... హైదరాబాదులో జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి పవన్, శృతి హాసన్‌లతో ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. అదేదో ఇక్కడే చిత్రీకరిస్తే సరిపోయేది... ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆ పాటను ఇటలీలో చిత్రీకరించాల్సి ఉంది.
మరి డైరెక్టర్ ఇటలీ వెళ్లిపోతే... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకునేదెవరు? ఇదే ప్రశ్న చిత్ర యూనిట్ కు రాగా... పవన్ లోని డైరెక్టర్ వారికి మంచి దారే చూపారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీరు చూసుకోండి... మిగిలిపోయిన పాటను నేను షూట్ చేసుకుని వస్తానని పవన్ డైరెక్టర్‌కు చెప్పారట. గతంలో జానీ చిత్రాన్ని పవన్ తెరకెక్కించిన విషయాన్ని గుర్తు చేసుకున్న డైరెక్టర్ డాలీ, చిత్ర నిర్మాతలు ఈ ప్రతిపాదనకు ఏమాత్రం సంకోచించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో ప్రస్తుతం డాలీ హైదరాబాదులో జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటుండగా, శృతి హాసన్, సాంకేతిక నిపుణులను తీసుకుని ఇటలీలో ల్యాండైన పవన్ సదరు బ్యాలెన్స్ పాటను తన సొంత దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/