Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ కు షాక్..సైలెంట్ గా మొదలెట్టిన పవన్
By: Tupaki Desk | 24 Jun 2022 10:31 AM GMTపవన్ స్టార్ పవన్ కల్యాణ్ స్టార్ డైరెక్టర్ కు షాక్ ఇచ్చినట్టేనా అంటే టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' మూవీతో మూడేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ పవన్ కు మంచి విజయాన్ని అందించింది. ఈ మూవీ తరువాత క్రిష్ డైరెక్షన్ లో పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' మూవీలో నటిస్తూనే మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మలయాళ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా 'భీమ్లానాయక్' మూవీని చేశారు. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాల తో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సాగర్ కె. చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రానా కీలక పాత్రలో నటించగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా నటించారు.
ఈ మూవీ తరువాత 'హరి హర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ దీనితో పాటు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ప్రకటించిన 'భవదీయుడు భగత్ సింగ్'ని కూడా సెట్స్ పైకి తీసుకెళతాడని, ఈ రెండు సినిమాలని ప్యారెలల్ గా పూర్తి చేస్తాడని అంతా భావించారు. కానీ అది జరగేలా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ మూవీని ప్రారంభిస్తారని అనుకుంటే సైలెంట్ గా పవన్ కల్యాణ్ మరో రీమేక్ ని పట్టాలెక్కించారు.
సముద్రఖని నటించి తమిళంలో తెరకెక్కించిన చిత్రం 'వినోదాయ సితం'. ఈ మూవీని తెలుగులో సుద్రఖని డైరెక్షన్ లోనే రీమేక్ చేస్తున్నారు. శుక్రవారం ఈ మూవీని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి షాకిచ్చారు. దైవ దూత పాత్రలో పవన్ కల్యాణ్ ఈ మూవీలో కనిపించబోతున్నారు.
మరో యంగ్ హీరో క్యారెక్టర్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. కార్ యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన వ్యక్తికి దేవుడు మరో ఛాన్స్ ఇస్తే ఎలా వుంటుంది? అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇందులో యాక్సిడెంట్ కు గురై దైవ దూత కారణంగా సెకండ్ లైఫ్ ని పొందే యువకుడిగా సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో నటిస్తున్నారట. భారీ స్థాయిలో రికార్డు స్థాయి డేట్స్ లో పూర్తి కానున్న ఈ మూవీని శుక్రవారం సైలెంట్ గా ప్రారంభించిన చిత్ర బృందం జూలై సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించ నుందట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడించబోతున్నారు. సడన్ గా ఈ ప్రాజెక్ట్ ని లైన్ లోకి తీసుకురావడంతో ఇండైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్ కు పవన్ షాకిచ్చాడని చెబుతున్నారు.