Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ వేలికి `నాగ అంగుళీకం` వెనక రహస్యం!
By: Tupaki Desk | 5 April 2021 4:30 AM GMTసినీపరిశ్రమలో నమ్మకాలు సెంటిమెంట్ల గురించి చెప్పుకుంటూ వెళితే చాలా ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. నటసింహా నందమూరి బాలకృష్ణకు జ్యోతిష్యం హస్త సాముద్రికంపైనా నమ్మకం అని చెబుతారు. నిరంతరం దేవుని పూజ చేయనిదే రాహుకాలం ..వారం వర్జ్యం చూడనిదే కాలు బయటపెట్టరని చెబుతారు. అలాగే విక్టరీ వెంకటేష్ వివేకానందుని ఆధ్యాత్మిక వైఖరిని అనుసరిస్తారు. జ్ఞానసాముపార్జనతో జీవించడానికి ఆసక్తిగా ఉంటారు. మోహన్ బాబు సాయి నామస్మరణలోనే జీవిస్తారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ ఇరువురికి సెంటిమెంట్లు ఎక్కువేనని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. దేవుళ్లు అంటే నమ్మకం ఆధ్యాత్మికత ఆ ఇరువురికి కామన్ గానే ఉంది. పూజారులు ఆధ్యాత్మిక గురువుల్ని గౌరవిస్తారు. అలాగే ఒక గురువును కూడా అనుసరిస్తారని చెబుతారు. ఇరువురి ఇండ్లలో హోమాలు వగైరా కామన్ గానే జరుగుతుంటాయి.
పవన్ కల్యాణ్ ఇంతకుముందే స్నేహితుడు త్రివిక్రమ్ చేతుల మీద యజ్ఞోపవీతం (పవిత్రమైన దారం) ధరించారని గుసగుసలు వినిపించాయి. తాజాగా వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేదికపై నాగ అంగుళీకం ధరించి పవన్ కనిపించడంతో జనాల దృష్టి అటువైపు మళ్లింది. నాగు పామును తలపించే డిజైన్ తో ఉన్న ఈ ఉంగరం దేనికి సంకేతం? అసలు ఏమిటా సెంటిమెంట్? అంటూ చర్చా వేడెక్కిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అనేక మనోభావాలు నమ్మకాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతకు గొప్ప ఫాలోవర్. అతడిపై స్నేహితుడు త్రివిక్రమ్ ప్రభావం చాలా ఎక్కువ అని చెబుతారు. చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సన్నిహిత మత గురువు మార్గదర్శకత్వంలో ఉపనామం చేయడం ద్వారా బ్రాహ్మణత్వాన్ని చేపట్టారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ఇద్దరికీ కామన్ గురువు అయిన ఒకే మత వ్యక్తి వేర్వేరు హోమాలను ప్రదర్శిస్తాడు. గురువుగారే పవన్ కి ప్రత్యేక అంగుళీకాన్ని ధరించాలని సూచించినట్టు చెబుతున్నారు.
సాధారణంగా సామాన్య ప్రజలు ఎప్పుడూ ఈ రకమైన ఉంగరాలను ధరించరు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల సూచించినప్పుడు అవి ధరిస్తారు. ఆ ఉంగరాన్ని ధరించడానికి కారణమేమిటో పవన్ కళ్యాణ్ చెబుతారేమో చూడాలి. వకీల్ సాబ్ ఈనెల 9న విడుదల కానుంది.