Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఓపెన్ గా చాలానే చెప్పేశారు

By:  Tupaki Desk   |   10 April 2016 6:30 PM GMT
ప‌వ‌న్ ఓపెన్ గా చాలానే చెప్పేశారు
X
ప‌వ‌న్ క‌ల్యాణ్ నోరు విప్పారు. మీడియాకు అరుదుగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చే ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాజాగా ప‌రిమిత మీడియా సంస్థ‌ల‌కు విస్తృతంగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చేశారు. ఒక మీడియా ఛాన‌ల్ కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చిన సంద‌ర్భంగా సినిమాలు.. రాజ‌కీయాలు.. రాష్ట్ర విభ‌జ‌న.. ఇలా అన్ని విష‌యాల మీద ఓపెన్‌గా మాట్లాడేశారు.అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు త‌డుముకోకుండా స‌మాధానాలు చెప్పేశారు. ప్ర‌శ్న‌లు కాదు కానీ.. ప‌వ‌న్ ఇచ్చిన స‌మాధాన‌లు చూస్తే..

= ప్ర‌జారాజ్యంలో ప‌ని చేసిన‌ప్పుడు ప‌రిమితుల‌తో చేశా.
= ప్ర‌జారాజ్యంలో నేనేం మాట్లాడినా అన్న‌య్యే బాధ్య‌త వ‌హించాల్సి వ‌చ్చేది.
= అన్న‌య్య‌తో రాజ‌కీయ విభేదాలున్నాయి. రాజ‌కీయంగా అన్న‌య్య నా ప్ర‌త్య‌ర్థి.
= పార్టీ మారాలంటే బ‌ల‌మైన కార‌ణాలు ఉండాలి. అధికారం కోసం పార్టీ మార‌టం స‌రికాదు.
= ప్ర‌శ్నించ‌టానికే జ‌న‌సేన వ‌చ్చింది. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాం.
= ఈ క్ష‌ణం నుంచే కార్యాచ‌ర‌ణ‌లో ఉన్నాం.
= సాంస్కృతికంగా తెలంగాణ‌.. ఆంధ్రాలు ఎప్పుడూ క‌ల‌వ‌వు.
= రిజ‌ర్వేష‌న్ల గురించి మాట్లాడితే కులంతో ముడిపెడ‌తారు .
= తెలుగులో త‌మిళ‌సినిమా మార్కెట్ పెరిగింది. త‌మిళంలోకి వెళ్ల‌టానికి తెలుగు సినిమా భ‌య‌ప‌డుతోంది.
= రెండు మూడు సినిమాలు మాత్ర‌మే చేస్తా. క‌చ్ఛితంగా ఇన్ని అన్న‌ది కాదు.. సినిమాలు ఎప్పుడు ఆపేస్తానో తెలీదు.
= నా ద‌గ్గ‌ర ఎక్కువ‌గా డ‌బ్బులు లేవు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.
= నెల గ‌డ‌వాలంటే క‌ష్టంగా ఉంది.
= రాజ‌కీయాల్లో తిట్టే వాళ్ల‌ను.. పొగిడేవాళ్ల‌ను భ‌రించాలి.
= నా సినిమాల్లో తెలంగాణ భాష‌కు..సంస్కృతికి స‌ముచిత స్థానం ఇచ్చా.
= నేను కాన్షియ‌స్ తోనే ఆ ప‌ని చేశా. తెలంగాణ యాస పెడితే అక్క‌డి వారికి క‌నెక్ట్ కాద‌న్నా.. ఫ‌ర్లేద‌న్నా.
= ప్ర‌త్యేక‌మైన మేన‌రిజ‌మ్ ఇష్టం ఉండ‌దు.
= నా ప‌ని నేను చేస్తా.. నా ప్ర‌య‌త్నం నేను చేస్తా.
= స్టాఫ్‌కి జీతాలు ఇవ్వ‌టం క‌ష్టంగా ఉంది.
= ఒక నిర్ణ‌యం తీసుకునే ముందు ఒక‌టికి వంద‌సార్లు ఆలోచిస్తా.
= నా స్థాయి ఏంటో నాకు తెలుసు. దెబ్బ తిన్నా ప్ర‌యోగాలు చేయ‌టం ఆప‌ను.
= జ‌న‌సేన‌లో నేనేం మాట్లాడినా నేనే బాధ్య‌త వ‌హిస్తా.
= రొమాంటిక్ సీన్స్ చేసేట‌ప్పుడు ఇబ్బంది ప‌డ‌తా.
= కుటుంబప‌రంగా అన్న‌య్య‌తో విభేదాలు లేవు.
= అన్న‌య్య పూర్తిస్థాయి కాంగ్రెస్ వాది.
= అధికారం కోసం పార్టీలు మార‌టం మంచిది కాదు. పార్టీలు మారితే బ‌ల‌మైన కార‌ణాలు ఉండాలి.
= నేను హ‌డావుడిగా ఎక్కువ సినిమాలు చేయ‌లేను.
= ఒక ప‌ని మీద దృష్టి పెడితే వేరే అంశాల మీద దృష్టి సారించ‌లేను.
= అంచ‌నాలు పెరిగితే నెర్వ‌స్‌గా ఫీల్ అవుతా.
= ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యం మీద మ‌ర్చిపోలేదు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడ‌తా. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌తా.
= ఆంధ్రా నుంచి ఒక ఖ‌లిస్థాన్ ఉద్య‌మం వ‌స్తుందేమోన‌న్న భ‌యం ఉంది.
= మాట ప‌డి.. గాయంతో విభ‌జ‌న జ‌రిగింది. ఇప్పుడు పెద్ద‌దిగా క‌నిపించ‌కున్నా.. ఒక జ‌న‌రేష‌న్ త‌ర్వాత ఉద్య‌మం వ‌స్తుంద‌న్న భ‌యం ఉంది.
= పొలిటిక‌ల్ స్పేస్ కాదు.. విష‌యాల మీద తెలియ‌జెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పాలిటిక్స్ కోసం వ‌చ్చా.
= విభ‌జ‌న చేసిన విధానం మీద నాకు బాధ ఉంది.
= బ‌లంగా పోరాటం చేయాల‌ని ఉంది. ఆ ధైర్యం ఉంది. కానీ.. ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయి. స్టాప్ ను మొయింటైన్ చేయ‌టంలో ఇబ్బంది ఉంది
= నేను గెలుస్తాన‌ని కాదు.. నేనెప్పుడూ ఆ మాట చెప్ప‌ను. నేను చెప్పేది ఎప్పుడూ పోరాటం చేస్తాన‌ని చెబుతుంటా.
= దెబ్బ తింటాన‌ని భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గ‌ను.
= సినిమాలో ఆలీతో తిట్టించుకోవ‌టం అంటే.. బ‌య‌ట జ‌నం న‌న్ను అనే మాట‌లే. అదేదో మ‌న‌మే అనేసుకుంటే పోలా.