Begin typing your search above and press return to search.
ఫ్లాపులున్నప్పుడు వచ్చి అడిగారు: పవన్
By: Tupaki Desk | 25 March 2018 5:25 PM GMTఈ మధ్య జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తర్వాత చల్ మోహనరంగా వేడుకకు అతిధిగా వచ్చాడు. తానొక నిర్మాత కావడం కారణమే అయినప్పటికీ నితిన్ తో అంతకు మించిన రిలేషన్ ఉండటం కూడా మరో రీజన్ గా చెప్పొచ్చు. గతంలో తాను వరసగా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి వచ్చి ఇష్క్ సినిమా ఆడియోకు రావాల్సిందిగా అడిగారని, కాని ఈ టైంలో తాను వెళ్ళడం భావ్యం కాదనిపించి అదే మాట చెప్పానని కాని నిండు మనసుతో ఆయన పిలిస్తే కాదనలేక వెళ్ళానని ఆనాటి సంఘటన గుర్తు చేసుకున్నారు. నితిన్ కు తనకు వయసు రిత్యా చాలా గ్యాప్ ఉన్నా సినిమా కెరీర్ పరంగా ఇద్దరం అటు ఇటు గా నాలుగేళ్ల తేడాతోనే ఉన్నామని చెప్పి నవ్వులు పూయించాడు పవన్. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే ఎలా ఉంటుందో తెలుసన్న పవన్ నితిన్ కు 25 సినిమాలు పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు చెప్పాడు.
ఇక తమన్ గురించి చెబుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్నీ షేర్ చేసుకున్నాడు పవన్. మణిశర్మ దగ్గర తమన్ పని చేస్తున్నప్పుడు ఖుషి సినిమా కోసం హింది పాట ఒకటి కావాలని అడిగితే అందులో తమనే కీలక పాత్ర పోషించాడని గుర్తు చేసాడు. పాట చూస్తూ డాన్స్ చేయాలనిపించాలని అప్పుడే కోరానని దానికి తగ్గట్టే కంపోజింగ్ జరగటం గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించి తమన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. సినిమాకు వర్క్ చేసిన అందరికి విషెస్ చెప్పిన పవన్ మరో నిర్మాత నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఎక్కువ సేపు మాట్లాడకుండా సింపుల్ గా ఐదు నిమిషాల్లో తన స్పీచ్ ముగించిన పవన్ మాట్లాడుతున్న టైంలో ఫాన్స్ గుంపులో నుంచి సిఎం సిఎం అంటూ నినాదాలు వినిపడటం గమనార్హం. పవన్ అప్పుడు మౌనాన్నే ఆశ్రయించాడు. తన స్పీచ్ అవ్వగానే వడివడిగా వెళ్ళిపోయిన పవన్ చాలా రోజుల తర్వాత క్యాజువల్ డ్రెస్ లో కనిపించడం అందరిని ఆకట్టుకుంది.