Begin typing your search above and press return to search.

చరణ్ నా తమ్ముడు.. అన్నావదినలు తల్లిదండ్రులు

By:  Tupaki Desk   |   13 April 2018 4:54 PM GMT
చరణ్ నా తమ్ముడు.. అన్నావదినలు తల్లిదండ్రులు
X
రంగస్థలం సక్సెస్ మీట్ లో రామ్ చరణ్ ను.. పవన్ కళ్యాణ్ అభినందించిన తీరు అసామాన్యం. అసలు ఓ సినిమా గురించి కానీ.. ఓ యాక్టర్ గురించి కానీ.. పవన్ నోట ఇలాంటి మాటలు ఇప్పటివరకూ ఎప్పుడూ ఎన్నడూ వినలేదు. కనీసం తన సినిమాల గురించి కూడా ఎప్పుడూ పొగుడుకోని పవన్.. రంగస్థలం విషయంలో రామ్ చరణ్ ను మాత్రం ఆకాశానికి ఎత్తేశాడు. అయితే.. 'రంగస్థలం తాలూకు విజయోత్సవ వేడుకలు.. అవి ఆగకూడదనే కోరుకుంటున్నా' అంటూ మరింత ఉత్సాహం నింపాడు పవన్.

'ఇంత దూరం నుంచి వచ్చిన నా సోదరులు.. అక్కచెల్లెళ్లకు కృతజ్ఞతలు. రంగస్థలంలో నటించిన అందరూ టెక్నీషియన్స్ ను ఒక స్టేజ్ పై నిలబెట్టడం కష్టం. వారంతా ఒక సమూహంలా ఉన్నారు. ఉత్తేజం కలిగించే విజయం సాధించారు. రంగస్థలం అత్యంత అద్భుతమైన విజయం సాధించింది. అనేక రికార్డులు బద్దలు కొట్టింది. కలెక్షన్స్ పరంగానే కాకుండా.. భారత చలనచిత్ర చరిత్రలోనే గర్విచందగగ్గ మంచి సినిమా తీసిన సుకుమార్ కు ధన్యవాదాలు. అలాంటి చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీస్ కి ధన్యవాదాలు. నేను ఎప్పుడూ సినిమాలో యాక్ట్ చేయడమే కానీ థియేటర్ లో చూడలేదు. సంధ్య థియేటర్ లో తొలిప్రేమ చూశాను.. అది కూడా సగంలో వచ్చేశాను' అన్నాడు పవర్ స్టార్.

'చాలా ఏళ్ల తర్వాత ఓ సినిమాను పబ్లిక్ థియేటర్ లో చూడాలని కోరిక కలిగింది. దానికి కారణం.. చరణ్.. రాంచరణ్ పెర్ఫామెన్స్ గురించి అందరూ మాట్లాడుతుంటే.. హాలీవుడ్ బెస్ట్ పిలిమ్స్ కంటే ఎక్కువ రేటింగులు వస్తుంటే చాలా ఆనందం వేసింది. ఐఎండీబీ రేటింగుల్లో కూడా రంగస్థలం టాప్ సినిమాల్లో నిలిచింది. అసలు ఈ సినిమాలో ఏం ఉంది అనే ఉత్సాహం కలిగింది. కొద్ది రోజుల క్రితమే థియేటర్ లో చూసే అవకాశం కలిగింది' అన్న పవన్ కళ్యాణ్.. సినిమా చూసినంత సేపు రంగస్థలం అనే ఊళ్లో జరిగిన జీవితంలా అనిపించింది అంటూ తన సినిమాపై పర్సనల్ ఫీలింగ్ ను ఓపెన్ గా చెప్పేశాడు.

'గతేడాది కాలంగా అన్నయ్య గారిని.. చరణ్ ను కలవడానికి ఇంటికి వెళితే.. మురికి బట్టలతో లుంగీ కట్టుకుని కనిపించేవాడు. ఏంటీ ఏం చేస్తున్నాడు అనుకునేవాడిని.. ఇలాంటి పాత్ర చేయడానికి సిగ్గొదిలేయాలి. అసలు చరణ్ సిటీలోనే హైద్రాబాద్ లో పెరిగాడు. పల్లెటూరి వాతావరణం ఎలా ఉటుందో తెలియదు. నాకు తెలిసిన చరణ్.. నేలకు చాలా దగ్గరగా ఉంటాడు.. ఎంత ఎదిగినా అణిగిమణిగి ఉంటాడు. అతని గుండెలోతుల్లో ఉన్న అత్యంత సహజత్వమే ఈ సినిమా. అమేజింగ్ పెర్ఫామర్ రాం చరణ్' అన్నాడు పవన్ బాబాయ్ కం అన్నాయ్.

'రామ్ చరణ్ కు నేను పెద్దన్నయ్య లాంటి వాడిని.. బాబాయ్ కంటే నేను అన్నయ్యను. నేను ముసుగు తన్ని పొడుకుంటే.. తెల్లారు జామునే వెళ్లిపోయి హార్స్ రైడింగ్ చేసేవాడు. రామ్ చరణ్ ఆర్టిస్టిక్ మెటీరియల్. సంపూర్ణమైన నటుడు. మంచి నటులుు అయితే బైట వారిని అయినా మనస్ఫూర్తిగా అబినందిచాలని ఉంటుంది. రంగస్థలం చూసి బైటకు రాగానే.. కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను' అని చెప్పాడు పవన్ కళ్యాణ్.

'నాకు చిట్టిబాబు అంటే చిన్న తమ్ముడి లాంటి వాడు. వీడు అని చరణ్ ను నేను చాలా తక్కువ సార్లు అంటాడు. మా అన్నయ్య నాకు తండ్రి.. మా వదిన నా తల్లి. వాడిలో అతిశయం చూడలేదు. తన పని చేసుకుని వేళ్లిపోతాడు.. విజయాలు వరించి వస్తాయ్.. ఇది ఆరంభం మాత్రమే. ఏ నిరాడంబరత అయితే తనలో ఉందో.. అదే తనను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది' అని పవన్ చెప్పిన తర్వాత.. చరణ్- పవన్ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం.. ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగించేసింది.

చరణ్ పెర్ఫామెన్స్ నుంచి.. సుకుమార్ ప్రతిభ వరకూ.. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరినీ ఆకాశానికి ఎత్తేశాడు. రంగస్థలం మూవీని ఆస్కార్ కు పంపాల్సిన స్థాయి మూవీ అన్న పవర్ స్టార్.. ఇది మన కథ అంటూ చెప్పుకొచ్చాడు. 'దక్షిణ భారతం. ఉత్తర భారతం కలిపి.. ఒక లాబీగా ఏర్పాటు అయ్యి.. రంగస్థలంను ఆస్కార్ కి పంపకపోతే ద్రోహం చేసిన వాళ్లం అవుతాం.ఇలాంటి సినిమాను లాస్ ఎంజెల్స్ కు పంపితే మన ఖ్యాతి.. మన సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినట్లు అవుతుంది. నేను దంగల్ గురించి ట్వీట్ చేశాను. అది మన కథ అనిపించింది. ఇప్పుడు రంగస్థలం కూడా అంతే. మన నేల కథ.. మన తెలుగు నేల కథ.. మన మట్టి కథ' అంటూ ఆవేశపూరితంగా చెప్పిన పవన్.. 'మనం యాక్షన్.. రొమాంటిక్ చూస్తాం.. మన పౌరుషాలు.. మన పట్టింపులు.. మన గొడవలు.. ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ చేసి ఇండియా తరఫున పంపాల్సిన సినిమా.. పంపకపోతే ద్రోహం చేసినవాళ్లం అవుతాం' అన్నాడు.

'అట్టహాసాల కంటే కూడా.. మనదైన వాస్తవికతో రూపొందిన సినిమా ఇది. ఇలాంటి సినిమాను ప్రమోట్ చేయడం మన బాధ్యత. రెండేళ్ల క్రితం బాహుబలికి ఎలా నిలబడ్డారో.. ఇవాళ రంగస్థలంకు అందరూ తోడుగా నిలబడాలి. వర్గాలకు అతీతంగా.. తెలుగు సినిమా అంతా ఒకటై కదలాలి. రాజకీయంగా వేరు అయినా.. సినిమా పరంగా తెలుగు ఇండస్ట్రీ ఎపుడూ ఒకటే' అంటూ రంగస్థలం మూవీ రేంజ్ ను ఇంటర్నేషనల్ స్థాయికి చేర్చేశాడు పవన్.