Begin typing your search above and press return to search.

రాజ‌ధాని ప్ర‌క‌ట‌న రోజున ప‌వ‌న్ ట్విస్టేంటి?

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:40 AM GMT
రాజ‌ధాని ప్ర‌క‌ట‌న రోజున ప‌వ‌న్ ట్విస్టేంటి?
X
ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంబ్యాక్ మూవీ పింక్ రీమేక్ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ సెట్స్ కి జాయిన్ అయ్యారు. షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే షెడ్యూల్స్ విష‌యంలో చిన్న‌పాటి క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంద‌ని.. ఓ ప్లానింగ్ ప్ర‌కారం జ‌ర‌గ‌లేదన్న గుస‌గుసా వినిపిస్తోంది. ముందుగా అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో షూటింగ్ చేయాల‌ని అక్క‌డ భారీ సెట్లు వేసారు. ఇక్క‌డ షూటింగ్ ప్రారంభిస్తార‌ని భావించిన‌ ప‌వర్ స్టార్ అభిమానులు స్టూడియో వ‌ద్ద‌కు పెద్ద ఎత్తున‌ చేరుకున్నారు. కానీ ప‌వ‌న్ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. అల్వాల్-పాత బోయిన్ ప‌ల్లి ప‌రిస‌రాల్లో సాగిన‌ చిత్రీక‌ర‌ణ‌లో ప‌వ‌న్ పాల్గొన్నార‌ని తెలుస్తోంది. ఉద‌యం 8 గంట‌ల‌కే స్పాట్ కి చేరుకుని షూటింగులో ప‌వ‌న్ బిజీ అయ్యారు. అక్క‌డే మ‌ధ్నాహ్యం 2 గంట‌ల‌కు వ‌ర‌కూ షూటింగ్ చేసి ప్యాక‌ప్ చెప్పేసారు.

మొద‌టి రోజు కేవ‌లం చిన్న చిన్న స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. ప‌వ‌న్ పై కేవ‌లం మాంటేజ్ షాట్స్ తీసారు. అలాగే త‌న‌కు ఎలాంటి డైలాగులు ఇవ్వ‌లేదు. పవ‌న్ లుక్ కూడా ఏమాత్రం మార‌లేదు. ఆయ‌న య‌థావిధిగా గుబురు గ‌డ్డంతోనే క‌నిపించారు. ఇక్క‌డ షూటింగ్ అనంత‌రం అన్న‌పూర్ణ స్టూడియో లో షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ని తాజాగా తెలుస్తోంది.

అయితే ప‌వ‌న్ ఇలానే ఎందుకు చేశారు? పైగా నిన్న‌టి రోజు(సోమ‌వారం)న‌ ఏపీ శాస‌న‌స‌భ‌లో మూడు రాజ‌ధానుల బిల్లు ప్ర‌వేశ పెట్టారు. అదే రోజున ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌వ్వ‌డం యధృచ్ఛిక‌మా? లేక ప్రీ ప్లాన్ డ్ గా జ‌రిగిందా? అంటూ ర‌క‌ర‌కాల‌ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ కు ప‌వ‌న్ అడ్డు ప‌డ్డారు. రైతుల‌కు అన్యాయం చేస్తారా? అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రెండు మూడు రోజుల పాటు రైతుల‌తో నిర‌స‌న‌ల్లో పాల్గొన్నారు. అయితే బిల్లు ప్ర‌వేశ పెట్టిన రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్ పెట్టుకోవ‌డం ఏమిటి? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఒక నాయ‌కుడిగా ప్ర‌జా జీవితాన్ని మార్చివేసే ఇంత‌టి కీల‌క‌మైన‌ బిల్లు విష‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలియ‌దా? అని కొంద‌రు మండిప‌డుతున్నారు. గ‌ల్లా జ‌య‌దేవ్ లాంటి ముఖ్య నేత‌లంతా రైతుల‌తో క‌లిసి పోరాటం చేస్తే ప‌వ‌న్ మాత్రం షూటింగ్ చేసుకోవ‌డం ఏంటి? ఇదే జ‌న‌సేన పాల‌సీనా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. సాయంత్రం అయ్యాక మీడియా ముందు రాజ‌ధాని ఎక్క‌డికి పోలేదంటూ చేసిన‌ ఓదార్పు మాట‌లు హ‌స్యాస్ప‌దంగా ఉన్నాయ‌న్న‌ విమ‌ర్ళలు తారా స్థాయికి చేరుకున్నాయి.