Begin typing your search above and press return to search.
స్టైలింగ్ పై పవన్ మనసు పెట్టట్లేదా
By: Tupaki Desk | 16 March 2017 12:28 PM GMT సినిమా కెరీర్ బిగినింగ్ నుంచి ఓ స్థాయికి వచ్చేవరకూ.. పవన్ కళ్యాణ్ ను చూస్తే స్టైల్ ఐకాన్ అనిపించేది. ఆఫ్ స్క్రీన్ లో స్టైలింగ్-లుక్స్ పై పెద్దగా దృష్టి పెట్టని పవన్.. ఆన్ స్క్రీన్ పై మాత్రం తెగ మెరిసిపోయేవాడు. ప్రతీ సినిమాతోనూ ఏదో ఒక ట్రెండ్ సృష్టించేసేవాడు.
హెయిర్ స్టైల్ నుంచి డ్రెసింగ్ వరకూ అన్నింటిలోనూ స్పెషాలిటీ చూపించే వాడు పవన్. స్లింగ్ బ్యాగ్స్.. గ్యాప్ టీ షర్ట్స్.. 30-40 పాకెట్స్ ఉన్న జీన్స్ ప్యాంట్స్.. డ్యుయల్ జీన్స్.. ఇలా పవన్ చూపించిన స్టైల్స్ అన్నీ ఇన్నీ కావు. పవర్ స్టార్ నుంచి విడదీయలేని బంధాన్ని కుర్రకారు ఏర్పరచుకోవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. కానీ పవన్ ఇప్పుడు స్టైలింగ్ పై అంతగా దృష్టిపెట్టడం లేదేమో అనిపించక మానదు. ముఖ్యంగా కాటమరాయుడు మూవీలో పవన్ స్టైలింగ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్త స్టైల్స్ చూపించడం పక్కన పెడితే.. అసలు కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకోవడం లేదనే కామెంట్స్ పడుతున్నాయి. హీరో-హీరోయిన్స్ ఇద్దరి డ్రెసింగ్ లూ ఆకట్టుకోకపోవడం ఆశ్చర్యకరం. అఫ్ కోర్స్.. ఇప్పటివరకూ కేవలం స్టిల్స్ మాత్రమే కనిపించాయ్. మొత్తం మూవీలో లుక్ వేరేగా ఉండొచ్చు కానీ.. పోస్టర్లను మరీ ఇలా వేయడం ఆశ్చర్యకరమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/