Begin typing your search above and press return to search.
కత్తి ఎత్తొద్దని చెప్పింది పవనా??
By: Tupaki Desk | 13 Nov 2015 10:30 PM GMTచిరంజీవి 150వ సినిమా ఏదో తెలిసిపోయిందని, ఇక బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆనందించారు కానీ.. ఆ శుభముహూర్తం ఇంకా సెట్ అవలేదు. కత్తి రీమేక్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటే పెండింగ్ అనుకుంటే.. అసలు మెగా క్యాంప్ లో ఎవరూ దాని ఊసే ఎత్తండంలేదు.ఇప్పుడా ప్రాజెక్టుని పక్కన పెట్టేశారనే వార్తలు టాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం ఎవరో కూడా మాట్లాడేసుకుంటున్నారు చాలామంది.
కత్తి రీమేక్ కి మెగాస్టార్ మొగ్గు చూపినపుడు.. మొదట వద్దు అంటూ మొత్తుకున్నది రామ్ గోపాల్ వర్మ. కానీ ఇపుడు చిరంజీవి కత్తిని ఎత్తకుండా దించేయమని చెప్పినది పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇందుకు తగిన కారణాలు కూడా చెప్పేస్తున్నారు. నిజానికి కత్తి సినిమా అంతా ల్యాండ్ పూలింగ్ లు - అక్రమాలు - రైతులు - అన్యాయాలు అంటూ సాగుతుంది. గతంలో అమరావతి వెళ్లి పవన్ దీనిపై కాస్త విరివిగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాన్సెప్ట్ తో సినిమా తీస్తే.. అది ఏపీలో ప్రభుత్వానికి కాస్త నెగిటివ్ సెన్స్ టచ్ చేసే అవకాశముంటుదని పవన్ భావించారట. ఈ విషయాన్ని మొన్న చిరు ఇంటికి వెళ్లినపుడు పవన్ స్వయంగా డిస్కస్ చేశాడని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎందుకు వద్దో... మెగాస్టార్ కి వివరించే ప్రయత్నం చేయడంతో.. ఆయన కూడా మెత్తబడ్డాడని తెలుస్తోంది.
చిరుతోపాటు దీన్ని నిర్మిస్తానన్న చరణ్ కి అర్ధం అయ్యేట్టుగా పవన్ చెప్పాడని టాక్. మొత్తానికి మెగాస్టార్ ని పవన్ కళ్యాణే కత్తి ఎత్తనివ్వలేదన్నది సారాంశం. ఇకపోతే.. ఈ చిరంజీవి ఉన్నారు చూడండి.. స్వయంగా ఫ్యామిలీ మెంబర్లు అడిగినా కూడా.. త్వరలోనే 150వ సినిమా అంటున్నారు కాని.. ఏమీ చెప్పట్లేదట. చిరునవ్వు నవ్వుతున్నారు.. నాక్కూడా అంతే తెలుసునని వరుణ్ తేజ్ సెలవిచ్చాడులే.