Begin typing your search above and press return to search.
ఐదు కోట్ల సెట్ లో అన్నీ పాయింటే
By: Tupaki Desk | 24 Jan 2016 5:17 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ కి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఈ విషయం చాలా సార్లే ప్రూవ్ అయింది కానీ.. ప్రతీ సారి పవన్ తీసుకునే జాగ్రత్తలు చూస్తే, షూటింగ్ లో పాల్గొంటున్న మిగతావారికి కూడా ఆశ్చర్యం వేస్తుంటుంది. గుజరాత్ లో షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ హైద్రాబాద్ లో షూటింగ్ మొదలుపెట్టేశారు కూడా.
హైద్రాబాద్ లోనే రత్నాపూర్ సెట్ వేసిన సర్దార్ యూనిట్.. ఇందుకోసం ఇప్పటికి నాలుగున్నర కోట్ల రూపాయలు వెచ్చించింది. మిగిలిన వర్క్ లో చాలావరకూ ఇదే సెట్ లో తీయాల్సి ఉండడంతో.. భారీ మొత్తాన్నే వెచ్చించారు. ఈ సెట్ లో ఒక రైల్వే ట్రాక్ - ఒక మేళా - మార్కెట్ - అనేక ఇళ్లు - షాపులను కూడా కట్టేశారు. అయితే.. సినిమా ఫినిష్ అయ్యేపాటికి ఈ సెట్ ఖర్చు మరింత పెరుగుతుందని అంచనాలున్నాయి.
రత్నాపూర్ సెట్ కోసం ప్రతీ విషయాన్నీ పట్టి పట్టి చూస్తున్నాడంటున్నాయి యూనిట్ వర్గాలు. షూటింగ్ సమయంలో ట్రాఫిక్ ఎలా ఉండాలి, బ్యాక్ గ్రౌండ్ ఎలా కనిపించాలి, ఎంట్రన్స్ డోర్ డిజైన్ ఎలా ఉండాలి, షాపులు ఎక్కడ కట్టాలి లాంటి అన్నిటి పైనా కన్నేశాటడ. అవసరమైతే ఆర్ట్ డిపార్ట్ మెంట్ కి సలహాలు కూడా ఇస్తున్నాడట. ఒక సినిమాపై మూడేళ్లు కష్టపడ్డ స్టార్ హీరోకి... ఆ మూవీ కోసం ఏమేం కావాలో పక్కాగా తెలుస్తుంది కదా. అందుకే ఈ జాగ్రత్తలు.