Begin typing your search above and press return to search.
చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్..!
By: Tupaki Desk | 21 Feb 2022 7:37 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నరసాపురం సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 217పై కీలక ప్రసంగం చేశారు. మత్స్యకారుల అభ్యున్నతి మరియు వారి ప్రయోజనాల కోసం ఉద్దేశించిన మీటింగ్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజకీయంగానే కాదు సినీ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈగో గురించి ప్రస్తావిస్తూ.. పవన్ ప్రదర్శించిన హాహభావాలు పరోక్షంగా తన సోదరుడు చిరంజీవి ని టార్గెట్ చేయడానికే అని విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలే సమస్యలు సృష్టించి.. ఆ తర్వాత పరిష్కారం అంటూ మార్కులు కొట్టేస్తారని వ్యాఖ్యానించారు.
ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదనేది వారి విధానమని.. ఎంత పెద్ద వారైనా దేహీ దేహీ అని అడుక్కోవాలని అనుకుంటారని అన్నారు. ఎంత పెద్ద స్థాయి వ్యక్తులయినా వారి ఎదుటకు వచ్చి మోకరిల్లాలని.. అప్పుడే జగన్ ఈగో సంతృప్తి చెందుతుందని.. అంత ఇగో ఎందుకని పవన్ సంచలన కామెంట్స్ చేసారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. నియంతృత్వ రాచరిక కాదని పవన్ కల్యాణ్ అన్నారు.
తాను చావడానికైనా సిద్ధపడతాను కాని.. తలవంచడానికి సిద్ధంగా లేనని.. వంగి వంగి దండాలు పెట్టేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పరోక్షంగా ఇటీవల సినిమా టికెట్ రేట్ల అంశం మీద సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీని ఉద్దేశించినవే అనే కామెంట్స్ వినిపిస్తున్నారు.
పవన్ తన అన్నయ్య పేరు ప్రస్తావించకపోయనా.. ఆయన వ్యాఖ్యలు, హావభావాలు మాత్రం జగన్ ను చిరు అభ్యర్థించిన విషయాన్ని గుర్తు చేసేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖుల బృందం ఏపీ సీయంతో సమావేశమై ఇండస్ట్రీ సమస్యల మీద చర్చించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ కు చిరు చేతులు జోడిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం కోరుతున్న వీడియో బయటకు వచ్చింది.
దీంతో చిరంజీవి తన స్థాయికి క్రిందికి దిగి జగన్ ను అభ్యర్థించడం చర్చనీయాంశమైంది. అంతలా యాచించాల్సిన అవసరం లేదని అభిమానులతో పాటుగా పలువురు సినీ పెద్దలు - రాజకీయ నాయకులూ కామెంట్స్ చేసారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని గౌరవించి.. ఇండస్ట్రీ బాగోగుల కోసం రిక్వెస్ట్ చేయడంలో తప్పేంటన్నవారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఇన్ డైరెక్ట్ గా జగన్ ముందు చిరంజీవి చేతులు జోడించి మాట్లాడటాన్ని ప్రస్తావించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.