Begin typing your search above and press return to search.

పవన్ చెప్పిన 20లక్షల దీపాల లెక్క

By:  Tupaki Desk   |   15 Sept 2017 1:44 PM IST
పవన్ చెప్పిన 20లక్షల దీపాల లెక్క
X
పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో అంత ఎక్కువ యాక్టివ్ గా ఉండడు. కాకపోతే చెప్పాలని అనుకునే పాయింట్ ను ఏ మాత్రం మిస్ చేయకుండా ఉండేందుకు.. ట్విట్టర్ ను బాగానే ఉపయోగిస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యండిల్ కు 2 మిలియన్ల మంది ఫాలోయర్స్ జతయ్యారు. ఈ సందర్భంగా పవన్ తన ఫాలోయర్స్ కోసం ఓ స్పెషల్ ట్వీట్ పెట్టాడు.

"ముూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలుపెట్టినపుడు.. దారంతా గోతులు.. చేతిలో దీపం లేదు.. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టాను. నేను స్పందించిన ప్రతీ సమస్యకు మేమున్నామంటూ ప్రతిస్పందించి ఈ రోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలతో - మీ పవన్ కళ్యాణ్" అంటూ ట్వీట్ చేశాడు పవన్. అసలు పవన్ లాంటి స్టార్ హీరోకు ఓ 20 లక్షల మంది ఫాలోయర్స్ ఉండడం అంత పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే.. పవన్ ట్విట్టర్ కు 2 మిలియన్ల మంది ఫాలోయర్స్ అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ను సినిమాల కోసం ఓపెన్ చేయలేదు. సినిమా సంగతులు పోస్ట్ చేస్తూ నడపలేదు. పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేసే వ్యక్తి కాదు. కేవలం పొలిటికల్ ఎజెండా కాన్సెప్ట్ తోనే తన అకౌంట్ ను ప్రారంభించి.. తన భావాలను చెప్పేందుకే ఉపయోగించాడు. అంటే.. ఈ 20 మంది ఫాలోయర్స్ పవన్ లో ఉన్న పొలిటికల్ లీడర్ కు అనుకోవచ్చు.