Begin typing your search above and press return to search.
పవన్ మాట: నిద్రపోలేదు.. నిద్రపోనివ్వలేదు
By: Tupaki Desk | 21 March 2016 7:13 AM GMTసర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ పది నెలల కిందట మొదలైంది. గత ఏడాది ఆఖర్లోనే సినిమా రిలీజైపోతుందని ముందు వార్తలొచ్చాయి. తర్వాత సంక్రాంతి అన్నారు. చివరికి వేసవికి షిఫ్టయింది. ఐతే రెండు నెలలుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. రెండు మూడు యూనిట్లతో పని చేయిస్తున్నారని.. రేయింబవళ్లు షూటింగ్ చేస్తున్నారని.. అర్ధరాత్రి.. తెల్లవారుజామున కూడా కొన్ని సన్నివేశాలు తీస్తున్నారని.. ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు. పది నెలల నుంచి షూటింగ్ చేస్తూ.. ఇప్పుడు ఇంత హడావుడి ఎందుకవుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఐతే ఈ పది నెలల్లో ఎనిమిది నెలల పాటు షూటింగ్ చేసింది చాలా తక్కువ రోజులని.. తీసింది చాలా తక్కువ సన్నివేశాలని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్లో పవన్ మాటలతో అర్థమైపోయింది.
‘సర్దార్..’కు సంబంధించి 70 శాతం షూటింగ్ చివరి 50 రోజుల్లోనే పూర్తి చేసినట్లు చెప్పి అందరికీ షాకిచ్చాడు పవన్. ‘‘ఈ సినిమా గత ఏడాది అక్టోబరులోనే విడుదల కావాల్సింది. కానీ మూడు నెలలు.. మూడు నెలలు అంటూ నేనే తోసుకుంటూ వచ్చాను. ఈరోస్ వాళ్లను కూడా ఇబ్బంది పెట్టాను. గత రెండు నెలల్లో యూనిట్లో వాళ్లందరినీ విపరీతంగా హింసించాను. నేను నిద్రపోలేదు. వాళ్లనూ నిద్ర పోనివ్వలేదు. అర్ధరాత్రుళ్లు షూటింగ్ చేశాం. సినిమా 70 శాతం షూటింగ్ గత 45-50 రోజుల్లోనే చేశాం. డైరెక్టర్ బాబీతో పాటు అందరూ విపరీతంగా కష్టపడ్డారు. ఏప్రిల్లో సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరాలని శ్రమించాం. సహనంతో పని చేసినందుకు, నాకు సహకరించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అని చెప్పాడు పవన్. ఐతే అంతకుముందంతా ఎందుకు ఖాళీగా ఉండిపోయాడన్నది మాత్రం పవన్ వెల్లడించాడు.