Begin typing your search above and press return to search.
దేవరకొండకు పవన్ కళ్యాణ్ టైటిల్?
By: Tupaki Desk | 19 April 2022 3:06 AM GMTకొన్ని క్లాసిక్స్ ని టచ్ చేయకూడదు. కనీసం టైటిల్ ని అయినా తిరిగి ఉపయోగించాలంటే చాలా గట్స్ కావాలి. ఆ స్థాయి ప్రమాణాల్ని రిపీట్ చేయాలి. దానికోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. దానికి తోడు లక్ కూడా కలిసి రావాలి. కానీ ఇవన్నీ ఆలోచించారో లేదో కానీ.. విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ బృందం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ 'ఖుషీ'ని రిపీట్ చేసే ఆలోచనతో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోయినా సోషల్ మీడియాల్లో గుసగుస వేడెక్కిస్తోంది.
పవన్ కల్యాణ్ - భూమిక జంటగా నటించిన ఖుషీ మ్యాజిక్ గురించి తెలిసిందే. ఎస్.జె సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2001లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే గాక పెర్ఫామెన్సెస్ పరంగా మరో హైట్స్ ని చూపించింది. ఒకవేళ అదే టైటిల్ ని విజయ్ - సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కించే సినిమాకి ఉపయోగిస్తే చాలా కోణాల్లో హై-స్టాండార్డ్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.
టైటిల్ తోనే బోలెడన్ని అంచనాలేర్పడతాయి అనడంలో సందేహం లేదు. ఎక్కడ తేడా జరిగినా పవన్ కల్యాణ్ అభిమానులు వెంటాడుతారు. మాస్ ఫ్యాన్స్ నుంచి సెగ ఒక రేంజులో తాకుతుంది. ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దీనిపై శివ నిర్వాణ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే ఇవన్నీ. అలాగే ఈ చిత్రం ఏప్రిల్ 21న ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకోనుందని రెగ్యులర్ షూటింగ్ రెండు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
ఈ సినిమా కథాంశం ఆసక్తికరం. మంచు పర్వతాల నేపథ్యంలో లవ్ స్టోరీ ఇది. కశ్మీర్ - లద్దాక్ సహా మంచు పర్వతాల్లో మెజారిటీ భాగం చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కానీ విజయ్ - సమంత ఇద్దరూ షూటింగ్ కోసం కేవలం నాలుగు నెలలు మాత్రమే కేటాయించారు. దర్శకుడు శివ నిర్వాణ దానిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
నాగ్ అశ్విన్ 'మహానటి'లో దేవరకొండ- సమంత జంట స్పెషల్ అప్పియరెన్స్ ఎంతో మెప్పించింది. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఒక రేంజులో వర్కవుటైంది. మరోసారి ఈ జంట రిపీటవుతోంది.ఈసారి పూర్తి స్థాయి పాత్రల్లో లవర్స్ గా కనిపించబోతున్నారు. శివ నిర్వాణ మార్క్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ఇదని తెలుస్తోంది.
ఈ చిత్రం టైటిల్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. 2001 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ 'ఖుషి'ని టైటిల్ గా ఎంపిక చేస్తే అటుపై సవాళ్లను అంతే సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మంచు పర్వతాల్లో ప్రేమకథా చిత్రాలు అనగానే రోజా- దిల్ సే లాంటి భారీ చిత్రాలు అభిమానులకు స్ఫురణకు వస్తాయి. మణిరత్నం రేంజులో క్లాసిక్ ని శివ నిర్వాణ తెరకెక్కిస్తారా? అది కూడా కేవలం నాలుగే నెలల్లో.. ఏం జరగనుందో చూడాలి.