Begin typing your search above and press return to search.

ఇలాంటి ప్రోగ్రామ్స్ కు పవన్ వెళతారా?

By:  Tupaki Desk   |   7 July 2016 5:57 AM GMT
ఇలాంటి ప్రోగ్రామ్స్ కు పవన్ వెళతారా?
X
మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే ధోరణి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. పబ్లిక్ ఫంక్షన్లకే కాదు.. ప్రైవేటు ఫంక్షన్ల విషయంలోనూ ఆయన పెద్దగా కనిపించరు. ఇక.. విదేశాల్లో తెలుగువారు నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన అటెండెన్స్ అస్సలు కనిపించదు. అలాంటి పవన్ తన స్టైల్ కు భిన్నంగా తాజాగా లండన్ కు వెళుతున్నట్లు చెబుతున్నారు.

యూకేకు చెందిన తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా పవన్ కల్యాణ్ హాజరువుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 9న పవన్ కల్యాణ్ లండన్ కు చేరుకుంటారని చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం మొదలవుతుందని.. ప్రత్యేక అతిధిగా వస్తున్న పవన్ కు భారీగా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగువారి మీద అభిమానంతోనే తమ కార్యక్రమానికి వస్తున్నట్లుగా ఈ కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు. విదేశాల్లో తెలుగువారు నిర్వహించే కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని పవన్.. తాజాగా హాజరు కావటం ఆసక్తికరమనే చెప్పాలి.